
నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు(Nepal Floods) పెను విషాదాన్ని నింపాయి. హిమానీనదాలు కరిగి, ఊహించని రీతిలో ముంచెత్తిన వరదల ధాటికి అనేక ప్రాంతాలు నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. ఈ ప్రళయం సంభవించి ఐదు రోజులు గడుస్తున్నా పరిస్థితి ఇంకా భయానకంగానే ఉంది. ఈ వరదల్లో ఇప్పటివరకు 781 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజురోజుకు మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
Also Read : డార్క్ వెబ్‌లో ఉగ్ర కుట్ర.. అశ్లీల సైట్లు, సీక్రెట్ యాప్‌లతో పాక్ ISI డర్టీ గేమ్!
ఈ వరదల్లో సుమారు 2,500 మందికి పైగా స్థానికులు, పర్యాటకుల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. శిథిలాలు, భారీగా పేరుకుపోయిన బురద కింద మరికొన్ని మృతదేహాలు కూరుకుపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. గల్లంతైన తమ వారి సమాచారం కోసం కుటుంబ సభ్యులు ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌ల వద్ద కన్నీరుమున్నీరుగా నిరీక్షిస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ తమ వారు ప్రాణాలతో తిరిగి వస్తారన్న ఆశలు తగ్గిపోతున్నాయి.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఐదో రోజు కూడా సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. నేపాల్ సైన్యంతో పాటు భారత్, చైనా నుంచి వచ్చిన ప్రత్యేక విపత్తు నిర్వహణ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ప్రధాన రోడ్లు, వంతెనలు ధ్వంసం కావడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు, అత్యవసర మందులను అందిస్తున్నారు. వరదల వల్ల సర్వస్వం కోల్పోయిన వేలాది మంది ప్రజలు కట్టుబట్టలతో నిరాశ్రయులుగా మిగిలారు. ప్రస్తుతం వారు తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. బాధితులకు కనీస వసతులు కల్పించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.
Also Read : వినియోగదారుల జోబుకు చిల్లు.. సెప్టెంబర్ 1 నుంచి బిగ్ చేంజెస్.. మారనున్న 6 ముఖ్యమైన రూల్స్ ఇవే!









