
అక్టోబర్ 1 నుంచి కొన్ని ముఖ్యమైన రూల్స్ మారనున్నాయి. SBI ATM, గ్యాస్ సబ్సిడీ, FD, NPS వంటి వాటిలో కొత్త నిబంధనలు రానున్నాయి. అలాగే UPI పేమెంట్లకు సంబంధించిన మార్పు అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వస్తుంది. SBIలో శాలరీ అకౌంట్ ఉన్నవారికి ఇతర బ్యాంకుల ATMల్లో నెలకు 10 ఉచిత లావాదేవీలు ఉండేవి. ఇక నుంచి అవి 5కి తగ్గుతాయి. డబ్బులు తీసుకోవడం మాత్రమే కాదు.. ATMలో బ్యాలెన్స్ చెక్ చేయడం వంటి పనులు కూడా ఈ 5లోనే లెక్కిస్తారు. 5 ఉచిత లావాదేవీలు పూర్తయిన తర్వాత డబ్బులు తీస్తే ఒక్కోసారి రూ.23 + GST చెల్లించాలి. బ్యాలెన్స్ చెక్ వంటి ఇతర పనులకు రూ.11 + GST పడుతుంది. అయితే SBI సొంత ATMల్లో శాలరీ అకౌంట్ ఉన్నవారికి ఉచిత లావాదేవీలపై ఈ పరిమితి ఉండదు.
Also Read : GYANESH KUMAR మీద దాడి.. నిజంగా CECపై దాడా? లేక మోదీపైనా?
ఇక అక్టోబర్ 1 నుంచి బ్యాంకులు భారీ మొత్తంలో చేసే FDల వడ్డీ రేట్లను ప్రతిరోజూ ఆన్లైన్లో చెప్పాలి. సాధారణంగా రూ.3 కోట్ల నుంచి చేసే FDలను భారీ FDలుగా పరిగణిస్తారు. అయితే ఇది బ్యాంకును బట్టి మారవచ్చు. ఈ మార్పు సాధారణంగా మనం చేసే చిన్న మొత్తాల FDలకు వర్తించదు. వాటి వడ్డీ రేట్లలో మార్పు ఉండదు. మరోవైపు అక్టోబర్ 15 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ మొత్తానికి చేసే కొన్ని UPI వ్యాపార చెల్లింపులపై ఛార్జీ పడనుంది. రూ.2,000 వరకు చేసే UPI పేమెంట్లకు ఈ ఛార్జీ ఉండదు. చిన్న వ్యాపారులకు ఉచితంగా ఉండే కొన్ని UPI పేమెంట్లకు కూడా ఛార్జీ ఉండదు. ప్రభుత్వం చెప్పిన ప్రకారం.. వ్యాపారులకు చేసే దాదాపు 96 శాతం UPI పేమెంట్లపై ఈ మార్పు ప్రభావం ఉండదు.
ఇదిలావుంటే.. అక్టోబర్ 1 నుంచి గ్యాస్ సబ్సిడీ తీసుకునే వారు ఆధార్ వేలిముద్ర లేదా ఇతర బయోమెట్రిక్ వివరాలతో గుర్తింపు చెక్ పూర్తి చేయాలి. గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి ఈ పని చేయొచ్చు. అవసరమైన యాప్ ఉంటే ఫోన్లో కూడా చేసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చినప్పుడు డెలివరీ చేసే వ్యక్తి ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఈ ఆధార్ చెక్ పూర్తి చేయకపోతే సబ్సిడీతో వచ్చే 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ తీసుకోలేరు. 5 లేదా 10 కేజీల సిలిండర్లు అందుబాటులో ఉంటే వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. వాటికి సబ్సిడీ ఉండదు. ఆధార్ చెక్ పూర్తి చేసిన తర్వాత మళ్లీ సబ్సిడీతో గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. పెన్షన్ కోసం ఉపయోగించే NPSలో అక్టోబర్ 1 నుంచి కొత్త ఛార్జీ వస్తోంది. సేవా కేంద్రం ద్వారా NPSలో కొత్తగా చేరేవారు ఒక్కో ఖాతాకు రూ.200 చెల్లించాలి.
Also Read : ATM నుంచి గ్యాస్ వరకు.. అక్టోబర్1 నుంచి కొత్త రూల్స్









