
UPI : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్లలో డబ్బులు పంపేటప్పుడు మన నంబర్లు, పేర్లు బయటికి కనిపించకుండా గట్టి భద్రత కల్పించనుంది. యూజర్ల ప్రైవసీని కాపాడటం కోసం అన్ని బ్యాంకులు, యూపీఐ యాప్‌లతో కలిసి పనిచేస్తోంది. కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం మన పర్సనల్ సమాచారాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉండటంతో ఈ మార్పులు చేస్తున్నారు.
Also Read : E20 కాంట్రవర్సీపై నితిన్ గడ్కరీ షాకింగ్ రియాక్షన్.. మాట మార్చిన కేంద్ర మంత్రి..!
ప్రస్తుతం చాలా యూపీఐ యాప్‌లలో మనం డబ్బులు పంపినప్పుడు లేదా వేరే వాళ్ల నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు మన ఫోన్ నంబర్లు, పూర్తి పేర్లు అవతలి వాళ్లకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనివల్ల కొందరికి, ముఖ్యంగా మహిళలకు ఫోన్ నంబర్లు తెలిసిపోయి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేధింపులు పెరుగుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో, ఎన్‌పీసీఐ వెంటనే స్పందించి ఫోన్ నంబర్లు కనిపించకుండా దాచేయాలని యాప్‌లకు ఆదేశాలు ఇచ్చింది. అందరి వ్యక్తిగత వివరాలను సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత కంపెనీలపై ఉండటంతో ఈ రూల్ తెచ్చారు. ఈ మార్పులన్నీ చేసేందుకు యాప్‌లకు సెప్టెంబర్ 4 వరకు గడువు ఇచ్చారు.
ఇకపై యూజర్లు ఎలాంటి మార్పులు చూడబోతున్నారంటే, మనం ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్‌లలో వాడేటప్పుడు మన యూపీఐ ఐడీలు, మొబైల్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఎవరికీ పూర్తిగా కనిపించవు. ఒకవేళ నంబర్ కనిపించినా, చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. ముఖ్యంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు పంపిన తర్వాత అయితే మొబైల్ నంబర్ అసలు కనిపించకూడదని నిబంధన పెట్టారు.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకునేటప్పుడు చాలా మందికి తెలియక తమ మొబైల్ నంబర్‌నే ఐడీగా పెట్టుకుంటారు. అలా కాకుండా మన పేరుతోనే ఐడీ వచ్చేలా ఇకపై యాప్‌లు వాటంతట అవే డిఫాల్ట్‌గా సెట్ చేయాలని ఎన్‌పీసీఐ కోరుతోంది. దీనివల్ల మన ఫోన్ నంబర్ ఎవరికీ తెలియకుండా సేఫ్‌గా ఉంటుంది. డిజిటల్ పేమెంట్స్ చేసే వేగం తగ్గకుండా, మన ప్రైవసీకి ఎలాంటి డోకా లేకుండా ఈ కొత్త రూల్స్ అన్నీ బ్యాంకులు అమలు చేయనున్నాయి.
Also Read : నీట్ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు: మైనర్ల విడుదల, సిట్ ఏర్పాటుకు పరిశీలన









