Supreme Court Raises Big Question on Reservation
Supreme Court Raises Big Question on Reservation

Supreme Court : ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్‌పై సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ఆయన ఇతర ఎన్నికల కమిషనర్లతో కలిసి నిర్ణయం తీసుకోకుండా ఏకపక్షంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని పిటిషన్‌లో ఆరోపించారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఓటర్ల జాబితాల నుంచి దాదాపు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించారనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని పిటిషనర్‌ సుప్రీంకోర్టును కోరారు. మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అంగీకారం లేకుండా తీసుకున్నట్లు ఆరోపిస్తున్న నిర్ణయాలు చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని పిటిషన్‌లో కోరారు. అలాగే ఓటరు నమోదుకు గతంలో ఉపయోగించిన అసలు ఫారం-6ను తిరిగి తీసుకురావాలని కూడా విజ్ఞప్తి చేశారు.

Also Read : ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయొద్దు : అభిజీత్‌ దీప్కే సంచలన ప్రకటన!

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ మనీష్ గార్గ్, ఈసీఐ ఐటీ విభాగం అధిపతి సీమా ఖన్నాపై కూడా చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ కోరారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ వారిపై కేసు నమోదు చేసి ప్రాసిక్యూషన్‌ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. జ్ఞానేశ్ కుమార్‌పై ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 32 కింద చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.

గత 10 నెలల్లో ఓటర్ల పేర్లను చేర్చడం, తొలగించడం, తిరిగి చేర్చడం, అలాగే ఓటరు నమోదు విధానంలో మార్పులకు సంబంధించిన నిర్ణయాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి కనీసం 14 సార్లు అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణతో పాటు అన్ని నిర్ణయాలు కూడా ఏకగ్రీవంగానే తీసుకున్నామని, ఇద్దరు ఎన్నికల కమిషనర్లతో పాటు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఆమోదంతోనే నిర్ణయాలు జరిగాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Also Read : అసలు MDR అంటే ఏంటి? UPIలో రానున్న మార్పులేంటి?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.