PM Modi :  ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు ఉన్న సమయంలో బ్రిక్స్ దేశాలు కొత్త ఆలోచనలు, పరిష్కారాలకు ముఖ్యమైన కేంద్రాలుగా ఎదుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్‌ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరం సమావేశంలో మోదీ మాట్లాడారు. ప్రస్తుతం బ్రిక్స్‌ దేశాల్లో ప్రపంచ జనాభాలో దాదాపు 50 శాతం మంది ఉన్నారని మోదీ చెప్పారు. ప్రపంచ జీడీపీలో 40 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 25 శాతానికి పైగా వాటా బ్రిక్స్‌ దేశాలదేనని తెలిపారు.

గత కొన్ని సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రెండున్నర రెట్లు పెరిగితే.. బ్రిక్స్‌ దేశాల కలిపిన ఆర్థిక వ్యవస్థ దాదాపు నాలుగున్నర రెట్లు పెరిగిందని మోదీ వివరించారు. అంటే ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే బ్రిక్స్‌ ఆర్థిక బలం దాదాపు రెండింతల వేగంతో పెరిగిందని చెప్పారు.

Also Read : నెట్‌వర్క్‌ రావడం లేదని.. టెక్నీషియన్‌ను టవర్‌కు కట్టేశారు!

కొత్త టెక్నాలజీలు, కొత్త ఆలోచనల్లో కూడా బ్రిక్స్‌ దేశాలు కీలకంగా మారుతున్నాయని మోదీ అన్నారు. గ్రామస్థాయి ఆలోచనల నుంచి అత్యాధునిక టెక్నాలజీల వరకు ఎన్నో కొత్త అవకాశాలు బ్రిక్స్‌ దేశాల్లోనే పుట్టుకొస్తున్నాయని చెప్పారు. భారత్‌ నిర్వహిస్తున్న ఈ బిజినెస్‌ ఫోరం ఇప్పటివరకు జరిగిన బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరమ్‌లలోనే అతిపెద్దదని మోదీ తెలిపారు.

భారత్‌ తీసుకొచ్చిన యూపీఐ వల్ల డిజిటల్‌ చెల్లింపులు భారీగా పెరిగాయని మోదీ అన్నారు. ఆర్థిక సేవలు అందరికీ చేరేందుకు యూపీఐ ఎంతో ఉపయోగపడుతోందని చెప్పారు. ప్రపంచంలో జరుగుతున్న రియల్‌టైమ్‌ పేమెంట్లలో దాదాపు 50 శాతం యూపీఐ ద్వారా జరుగుతున్నాయని మోదీ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అడ్డంకులు పెరుగుతున్న సమయంలో భారత్‌ మాత్రం దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను పెంచేందుకు ప్రయత్నిస్తోందని మోదీ అన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు దాదాపు 40 దేశాలతో భారత్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని తెలిపారు. వ్యాపారాలకు అడ్డంకులు తగ్గించడం, కొత్త అవకాశాలు పెంచడమే తమ లక్ష్యమని చెప్పారు.

Also Read : రష్యా ఆయిల్ టూ మిసైల్స్.. ఢిల్లీ వేదికగా మోదీ-పుతిన్ భేటీ.. ప్రపంచం కళ్లన్నీ భారత్ వైపే!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.