Vande Mataram Bill 2026 : భారతదేశం జాతీయ గీతం ‘జన గణ మన’ ను దేవ ప్రజలంతా గౌరవిస్తారు. జాతీయ గీతాన్ని అవమానపరిచినా, అగౌరవపరిచినా శిక్షలు ఉంటాయి. తాజాగా అదే తరహాలోనే ‘వందేమాతరం’కు కూడా ఇకపై చట్టపరమైన రక్షణ లభించింది. ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ బిల్లు’కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు (మంగళవారం) ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారినట్లయింది.

దీనికోసం 1971 నాటి బిల్లులోని సెక్షన్‌ 3ను సవరించారు. దీని ద్వారా ‘వందేమాతరం’ను కూడా చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. జాతీయ గీతాన్ని అడ్డుకోవడం లేదా దాని గౌరవాన్ని భంగపరిచేలా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలకు అవకాశం ఉండనుంది. అయితే ఇప్పటివరకు ఆ స్థాయిలో వందేమాతరానికి ప్రత్యేక రక్షణ లేదు. దీనికోసం కేంద్రం పార్లమెంట్‌లో సవరణ తీసుకువచ్చింది. ఈ సవరణ ద్వారా జనగణమన లాగే వందేమాతరానికి కూడా చట్ట పరమైన రక్షణ కల్పించినట్లయింది.

ఈ కొత్త చట్టం ప్రకారం ‘వందేమాతరం’ పాడుతున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా ఆ గానం చేస్తున్న సమూహానికి అంతరాయం కలిగించడం చేసినట్లయితే శిక్షార్హమైన నేరం కింద పరిగణిస్తారు. దీనికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందనేది ఈ చట్టం చెబుతోంది.. వందేమాతరానికి చట్టపరమైన రక్షణ కల్పించే సవరణ బిల్లును గత నెలలోనే పార్లమెంట్ ఆమోదించింది. అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా నేడు రాష్ట్రపతి ముర్ము సంతకం చేయడంతో బిల్లు ఇప్పుడు అధికారిక చట్టంగా అమల్లోకి వచ్చినట్లయింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.