
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు వారి వ్యక్తిగత భద్రతతో పాటు వారు ప్రయాణించే ప్రత్యేక వాహనాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తాయి. ఇటీవల భారత్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సుకు కూడా ఈ ఇద్దరు నేతలు తమ సొంత బుల్లెట్‌ప్రూఫ్ కార్లతోనే వచ్చారు. ఈ రెండింటిలో ఏ కారుకు ఎక్కువ శక్తి ఉంది.. వాటి రక్షణ వ్యవస్థల ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.
వ్లాదిమిర్ పుతిన్ ‘ఆరస్’ ప్రత్యేకతలు
రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయాణించే వాహనం పేరు ‘ఆరస్’. దాదాపు 6 టన్నుల బరువుండే ఈ రష్యన్ కారును “ది బీస్ట్” అని కూడా పిలుస్తారు. ఈ కారుకు ఉన్న BR5 బాలిస్టిక్ రక్షణ వల్ల ఇది 7.62 మి.మీ. బుల్లెట్లను, గ్రెనేడ్ పేలుళ్లను, 6 కేజీల టీఎన్‌టీ (TNT) బాంబు దాడిని కూడా సునాయాసంగా తట్టుకోగలదు. ఈ వాహనంలో 80 మి.మీ. మందంతో ఉండే అత్యంత పటిష్టమైన బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ ఉంటుంది. ఒకవేళ దాడుల్లో టైరు పంక్చర్ అయినా కూడా.. ఇది గంటకు 80 కిలోమీటర్ల వేగంతో మరో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.
Also Read : నెట్‌వర్క్ రావడం లేదని.. టెక్నీషియన్‌ను టవర్‌కు కట్టేశారు!
पुतिन की कार या चलता-फिरता किला? 'AURUS SENAT' क्यों है इतनी खास?
रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन की Aurus Senat सिर्फ एक लग्जरी कार नहीं, बल्कि सुरक्षा से लैस एक खास कार है। जानिए इसकी खासियत, सुरक्षा, ताकत और कैसे ये रूस की अपनी प्रेसिडेंशियल कार बनी। pic.twitter.com/iukIQt9xPE
— RT Hindi (@RT_hindi_) September 12, 2026
ఆరస్ ఇంజన్ ఏకంగా 598 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మోటార్ సామర్థ్యం వల్ల 6 టన్నుల బరువున్నా కూడా కేవలం 6 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. భద్రత పరంగా ఇందులో ఈసీఎమ్ సిగ్నల్ జామ్మర్లు, అత్యవసర ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ, డ్రోన్‌లను నిర్వీర్యం చేసే సాంకేతికత కూడా అమర్చి ఉంచారు. అలాగే శత్రువులు అసలైన పుతిన్‌ను గుర్తుపట్టకుండా ఉండేందుకు ఆయన కాన్వాయ్‌లో ఒకే రకమైన 10 నుండి 15 ఆరస్ కార్లను నడుపుతారు. ఒకే సమయంలో ఒకేలాంటి కార్లను నడపడం వల్ల పుతిన్ ఏ కారులో ఉన్నారో శత్రువులు గుర్తించలేరు.
Also Read : హెచ్1బీ వీసాదారులకు ట్రంప్ బిగ్ షాక్.. ఉద్యోగం పోతే అంతే సంగతులు.. అమెరికాకు ప్యాకప్ చెప్పాల్సిందే!
షీ జిన్‌పింగ్ ‘హాంగ్‌కీ L5 / N701’ ప్రత్యేకతలు
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఏ దేశానికి వెళ్లినా తన అధికారిక ప్రభుత్వ వాహనమైన ‘హాంగ్‌కీ L5’ లేదా దాని ప్రత్యేక మోడల్ ‘N701’ను తీసుకెళ్తారు. మాండరిన్ భాషలో హాంగ్‌కీ అంటే “ఎర్ర జెండా” అని అర్థం. చైనా జాతీయ గర్వానికి చిహ్నంగా నిలిచే ఈ వాహనం బరువు 3,150 కిలోగ్రాములుగా ఉంది. దీని పొడవు 18 అడుగులు అంటే 5.5 మీటర్లు ఉంటుంది. దీని అంచనా విలువ సుమారు రూ.7 కోట్లు (1.7 మిలియన్ డాలర్లు). అయితే ఈ కారు కేవలం 8.0 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. రక్షణ పరంగా కూడా టాప్‌లో ఉంటుందని చెప్పవచ్చు. జీవ, రసాయన దాడుల నుండి లోపల ఉన్నవారిని కాపాడటానికి ఇందులో ప్రత్యేకమైన ఎయిర్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఉంది. అలాగే రాకెట్ దాడులను తట్టుకునే కవచ ఫలకాలు, అత్యంత మందమైన బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్, 360-డిగ్రీ కెమెరాలు, ఆల్-వీల్ డ్రైవ్ వ్యవస్థలు దీని సొంతం అని చెప్పవచ్చు.
ఏ కారు ఎక్కువ శక్తివంతమైనది?
ఈ రెండింటి రక్షణ వ్యవస్థలను పోల్చి చూస్తే వ్లాదిమిర్ పుతిన్ ప్రయాణించే ‘ఆరస్’ కారే ఎక్కువ శక్తివంతమైనదిగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఆరస్ కారు ఇంజన్ 598 హెచ్‌పీ శక్తితో కేవలం 6 సెకన్లలోనే 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. అదే హాంగ్‌కీ 100 కిమీ వేగానికి చేరుకోవడానికి 8 సెకన్ల సమయం తీసుకుంటుంది. అంతేకాకుండా బాంబు పేలుళ్లను తట్టుకునే సామర్థ్యం, పంక్చర్ రన్-ఫ్లాట్ టైర్లు, డ్రోన్ నిర్వీర్య టెక్నాలజీ, భారీ బాలిస్టిక్ రక్షణలో పుతిన్ ‘ఆరస్’ కారు చైనా ‘హాంగ్‌కీ’ కంటే పైచేయి సాధిస్తుంది.
పుతిన్ వైమానిక రక్షణ ఫ్లయింగ్ క్రెమ్లిన్
రోడ్డు ప్రయాణంలోనే కాకుండా గాలిలో కూడా పుతిన్ భద్రత అత్యంత పటిష్టంగా ఉంటుంది. ఆయన ప్రయాణించే ఇల్యూషిన్-96 విమానాన్ని “ఫ్లయింగ్ క్రెమ్లిన్” అని పిలుస్తారు. ఇది ఒక్కసారి ఆగకుండా 15,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఇది ఒక ఎగిరే బంకర్ లాంటిది. ఇందులో రాడార్‌ను తప్పించే కోటింగ్, అణు విద్యుదయస్కాంత పల్స్ (EMP) రక్షణ, క్షిపణులను దారి మళ్లించే DRCM మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి.









