Marriage : ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్ జిల్లా భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వింతైన ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు పిల్లలకు తల్లి అయిన తబస్సుమ్ అనే మహిళ.. ఆరుగురు పిల్లలకు తండ్రి అయిన మహమ్మద్ ఉమర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరిద్దరి పెళ్లి ఇప్పుడు ఆ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తబస్సుమ్ భర్త రియాజుల్ ఐదేళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అప్పటినుంచి ఆమె తన ముగ్గురు పిల్లలతో కలిసి అత్తగారింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో దాదాపు మూడేళ్ల క్రితం సిరస్వా దోరాహా ప్రాంతంలో మెకానిక్‌గా పనిచేస్తున్న మహమ్మద్ ఉమర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది.

కుటుంబ సభ్యులకు తెలియకుండా వీరిద్దరూ మొదట కలియార్ షరీఫ్‌లో నికాహ్‌ చేసుకున్నారు. ఆ తర్వాత కోర్టులో కూడా చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు. అయితే ఈ విషయం తబస్సుమ్ అత్తగారింటి సభ్యులకు, గ్రామస్థులకు తెలియడంతో ఊరిలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దీంతో గ్రామంలో పంచాయితీ ఏర్పాటు చేశారు. పంచాయితీలో వీరిద్దరూ కలిసి ఉండటానికే మొగ్గు చూపారు.

తబస్సుమ్ బావ పంచాయితీలో మాట్లాడుతూ.. తమ కుటుంబం ఇన్ని రోజులు ఆమెను సంతోషంగా చూసుకుందని, ఇప్పుడు ఆమె తన సొంత ఇష్టంతో వెళ్లాలనుకుంటుంది కాబట్టి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపాడు. అనంతరం తబస్సుమ్‌ను ఆమె పిల్లలు, ఇంటి సామానుతో కలిసి ఉమర్‌తో పంపించివేశారు. అయితే భవిష్యత్తులో ఆమెతో ఎలాంటి సంబంధం లేదా బాధ్యతలు ఉండవని అత్తగారింటి వారు స్పష్టం చేశారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.