
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్మీ తమ వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఇటీవలే పలు మోడళ్ల ధరలను తగ్గించిన రియల్ తాజాగా ‘పీ4 సిరీస్’ స్మార్ట్ఫోన్ల ధరలను కూడా భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రియల్మీ కొత్తగా P4S మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన తర్వాత రోజే ఈ ధరలను పెంచింది. మోడల్‌ను బట్టి ఏకంగా రూ. 2,000 నుండి రూ. 3,000 వరకు ధరలను పెంచింది. అయితే ఈ కొత్త ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. మెమొరీ చిప్సెట్ల ధరలు విపరీతంగా పెరగడం, తయారీ ఖర్చులు భారం కావడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
అయతే రియల్మీ P4x 5G సిరీస్‌లోని P4x మోడల్‌పై గరిష్టంగా రూ. 3,000 వరకు పెంచింది.
Also Read : లా స్కూల్ విద్యార్థులకు బిగ్ షాక్.. డిగ్రీ వేడుకలు రద్దు.. కొరియర్ ద్వారానే సర్టిఫికెట్లు.. కారణమదే!
Price hike alert🚨
realme increases the price of their smartphone by upto ₹3k: pic.twitter.com/GVb4j701q2— Kamal Singh (@Im4kamalsingh) August 27, 2026
ఇంతకుముందు రూ.24,999గా ఉన్న దీని 8GB+128GB వేరియంట్ ధర ఇప్పుడు ఏకంగా రూ. 27,999కి చేరింది. రియల్మీ P4 Power 5G సిరీస్‌లోని పవర్ఫుల్ బ్యాటరీతో వచ్చిన P4 Power 5జీ బేస్ వేరియంట్ (8GB+128GB) పై కూడా రూ. 3,000 పెరిగింది. దీంతో దీని ప్రారంభ ధర రూ. 29,999 నుండి రూ. 32,999కి పెరిగింది. రియల్మీ P4 Lite 4G & 5G బడ్జెట్ విభాగంలో లభించే P4 లైట్ సిరీస్ స్మార్ట్ఫోన్లపై రూ. 2,000 వరకు పెంచారు. ఈ పెంపుతో 6GB+128GB టాప్ వేరియంట్ ధర రూ. 20,999 నుండి రూ. 22,999కు చేరింది. రియల్మీ P4R 5G మోడల్‌పై కూడా రూ. 2,000 ధరను సవరించడంతో దీని బేస్ వేరియంట్ (4GB+64GB) ప్రారంభ ధర రూ. 19,999కి చేరుకుంది. కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేసుకుంటున్న రియల్ మీ స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు ఇది బిగ్ షాక్ అని చెప్పవచ్చు.
Also Read : కేంద్ర మంత్రివర్గంలో భారీ ప్రక్షాళన… తెలుగు రాష్ట్రాల నుంచి వారికి ఛాన్స్..









