దేశంలో జరుగుతున్న పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు-2026 ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పేపర్ లీకేజీల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఇరకాటంలో పడింది. ఎందరో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వీటిన్నింటిని ఆరికట్టాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది.

Also Read : ‘చికెన్ నెక్’ను చైనా ఇక టచ్ చేయలేదు.. మోదీ మాస్టర్ ప్లాన్ ఇదే!

ఈ కొత్త చట్టం ప్రకారం ఏదైనా పబ్లిక్ పరీక్షలో లీకేజీ లేదా అక్రమాలు జరిగినట్లు తేలితే కేవలం 2 నెలల వ్యవధిలోనే విచారణను వేగంగా పూర్తి చేయాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. అలాగే నేరాలకు పాల్పడిన దోషులకు రూ.10 కోట్ల వరకు భారీ జరిమానా విధించడంతో 10 ఏళ్లు జైలు శిక్ష విధించనున్నారు. అయితే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన వెంటనే వివిధ అంశాలపై విపక్షాలు నిరసనలు చేపట్టాయి. దీంతో స్పీకర్ లోక్‌సభను వాయిదా వేశారు. అలాగే రాజ్యసభలోనూ ఇలాంంటి తరహా ఆందోళనలు కొనసాగడంతో ఛైర్మన్ సభను తాత్కాలికంగా వాయిదా వేశారు.

Also Read : ప్రపంచాన్ని వణికిస్తున్న భారత్ పినాకా.. 44 సెకన్లలో శత్రువులు ఖతం.. పోటీపడుతున్న 12 దేశాలు