

Ravi Prakash
నమస్తే… మీరు ఎప్పుడైనా ఇలాంటి ఒక వీడియోను ఊహించారా? భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తన మొబైల్ ఫోన్ పట్టుకుని, ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి, సెల్ఫీ స్టైల్‌లో ఒక వీడియో రికార్డ్ చేసి నేరుగా దేశ ప్రజలతో మాట్లాడటం ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, వరుసగా మూడు రోజుల్లో ఏకంగా మూడుసార్లు జరిగింది! లక్షలాది మందితో హోరెత్తే భారీ బహిరంగ సభలు, ప్రైమ్‌టైమ్‌ని ఏలే ప్రత్యక్ష టీవీ ప్రసంగాలు, దేశవ్యాప్తంగా మారుమోగే ‘మన్ కీ బాత్’, హైటెక్ వీడియోలతో రాజకీయాన్ని శాసించే ఒక అగ్రనేత రాత్రికి రాత్రే ఇలా మారిపోవడం నిజంగా ఊహకందని సంచలనం. ఇది ఒక ప్రధాని అధికారిక ప్రసంగంలా లేదు, ఒక సాధారణ ఇన్‌స్టాగ్రామ్ రీల్ లా కనిపించింది. దీని వెనుక ఉన్న అసలు రాజకీయాన్ని విశ్లేషించే ముందు ఒక్కసారి ఆ పరిణామాల క్రమాన్ని అర్థంచేసుకోవాలి.
జూలై 24 అర్థరాత్రి ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఒక సెల్ఫీ వీడియోను అప్‌లోడ్ చేశారు. ఆ వీడియో పోస్ట్ చేసిన టైమింగ్ చూసి దేశంలోని రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయిన పరిస్థితి నెలకొంది. ఎలాంటి అధికారిక ప్రకటన లేదు, కనీసం ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయలేదు. ప్రధాని నేరుగా తన ఫోన్ కెమెరా ముందుకు వచ్చి ముఖాముఖిగా మాట్లాడటానికే మొగ్గు చూపారు. పరీక్షల వివాదంతో రగిలిపోతున్న కోట్లాది మంది విద్యార్థులను, దేశ యువతను ఉద్దేశించి ఆయన ఇచ్చిన సంచలన సందేశం ఇది. అయితే అసలైన ట్విస్ట్ ఆ తర్వాతే ఎదురైంది. కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే ఊహించని రీతిలో మరో వీడియో ప్రత్యక్షమైంది. మరుసటి రోజు అనగా జూలై 25న ప్రధాని మళ్లీ సెల్ఫీ మోడ్‌లోనే ప్రత్యక్షమయ్యారు. తన తొలి వీడియోపై స్పందించిన యువతకు ఈసారి ఆయన స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. విద్యార్థుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను అభినందిస్తూ వారి నుంచి అనేక విలువైన సూచనలు అందుకున్నానని స్పష్టం చేశారు. ఈసారి కూడా ఏ మైకూ లేదు, ఏ టెలిప్రాంప్టర్ లేదు, ఎలాంటి భారీ వేదికా కాదు. అక్కడ ఉన్నది కేవలం ప్రధాని, ఒక ఫోన్ కెమెరా, భారతదేశ యువతకు నేరుగా ఒక మెసేజ్. ఇది ఇంతటితో ముగిసిపోతుందని అంతా అనుకున్నారు, కానీ కథ ఇక్కడితోనూ ఆగలేదు. జూలై 26 అంటే నిన్న ప్రధాని మరొక డైరెక్ట్ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. కేవలం మూడే మూడు రోజుల్లో ఇది ఆయన మూడో వీడియో. ఇప్పటికే అందరికీ ఒక విషయం పక్కాగా అర్థమైపోయింది. ఇది ఏదో అనుకోకుండా చేసిన ప్రయోగం కాదు, దీని వెనుక ఒక పక్కా పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఉంది. మూడు వీడియోలు, మూడు రోజులు, ఒకే ఒక్క టార్గెట్ ఆడియన్స్ Gen Z!
ఇప్పుడు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది? ప్రధాని మోదీ హఠాత్తుగా నేరుగా యువత ముందే ఎందుకు నిలబడ్డారు? తన దశాబ్దాల కమ్యూనికేషన్ స్టైల్‌ను రాత్రికి రాత్రే ఇంతలా మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ సడన్ ఛేంజ్‌వెనుక ఉన్న అసలు మాస్టర్‌ప్లాన్ ఏంటి? ఇది కేవలం ఒక కొత్త డిజిటల్ స్ట్రాటజీ మాత్రమేనా లేక ముంచుకొస్తున్న ఏదో పెద్ద రాజకీయ భూకంపానికి సంకేతమా? ఎందుకంటే ఈ వీడియోలు ఏవీ హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడలేదు. గత కొన్ని వారాలుగా ఇటీవలి కాలంలో దేశం ఎన్నడూ చూడని రీతిలో ఒక భారీ యువజన ఆగ్రహజ్వాల హోరెత్తిపోతోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి ముంబై, పాట్నా, ప్రయాగ్‌రాజ్, అహ్మదాబాద్, నాసిక్, నాగ్‌పూర్ ఇలా దేశంలోని నలుమూలలా వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. అనేకమంది ప్రభుత్వాన్ని బహిరంగంగా నిలదీశారు. మరెంతో మంది ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. సోషల్ మీడియా షేక్ అయిపోయింది. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ వేలాది మీమ్స్, మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. కొన్ని రోజుల పాటు ఈ చర్చను పెద్ద పెద్ద టీవీ స్టూడియోలు కాదు, చేతుల్లో మొబైల్ ఫోన్లు పట్టుకున్న సాధారణ విద్యార్థులే లీడ్ చేశారు. చివరకు అంతర్జాతీయ మీడియా సైతం దీనిని “Gen Z నడిపిస్తున్న ఆల్-టైమ్ బిగ్గెస్ట్ మూవ్‌మెంట్”గా అభివర్ణించింది. వీధిపోరాటాలతో పాటు ఈ తరం మీమ్స్, రీల్స్, వైరల్ వీడియోలన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విధ్వంసకర పొలిటికల్ వెపన్స్‌గా మారాయనే డిబేట్ కు తెరదీశాయి.
ఇక్కడే అనేక ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. యువత నుంచి ఉవ్వెత్తున ఎగసిపడ్డ ఆగ్రహజ్వాలే మోదీ మార్క్ కమ్యూనికేషన్ స్టైల్‌నే మార్చేలా చేసిందా? Gen Zతో డైరెక్ట్ కనెక్ట్ కావడం వెనుక రాజకీయ అవసరం ఉందా? లేక ఈ మార్పులన్నీ అనుకోకుండా జరిగిన కో ఇన్సిడెన్సా? ఎందుకంటే ఒకవైపు ప్రధాని నేరుగా రిలీజ్ చేసిన ఆ మూడు వీడియోలు మీడియా హెడ్‌లైన్స్‌ను వణికిస్తున్న టైమ్‌లోనే బ్యాక్‌గ్రౌండ్‌లో అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బిజేపికి చెందిన ఒక సీనియర్ నేతే అందరినీ షాక్‌కు గురిచేస్తూ “విద్యార్థులతో వెంటనే చర్చలు జరపండి” అంటూ బహిరంగంగానే సంచలన కామెంట్ చేశారు. దీంతో ఈ పొలిటికల్ డ్రామా క్షణక్షణం పీక్స్‌కు చేరింది. ఇక ఆ తర్వాత కథ మొత్తం మారిపోయింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన రాజీనామా చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? మోదీ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అయిందా?
ఇప్పుడు ఒక్కసారి కొన్ని రోజుల వెనక్కి వెళ్దాం. విద్యార్థుల ఆగ్రహజ్వాలలు మొదలైన కొత్తలో ప్రభుత్వం స్పందించిన తీరు పూర్తిగా వేరు. పోలీసుల మోహరింపు, అరెస్టులు, నడిరోడ్లపై బారికేడ్లు, లాఠీఛార్జ్ ఆరోపణలు, వాటర్ క్యానన్ల ప్రయోగాలు జరిగాయి. వేలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చేశారు. ఢిల్లీ, ముంబై, పాట్నా, ప్రయాగ్‌రాజ్ ఇలా దేశంలోని ఎన్నో నగరాల నుంచి వచ్చిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. చాలా ఏళ్ల తర్వాత భారతదేశం కేవలం ఒక ఆందోళనను మాత్రమే చూడటం లేదు, దేశం ముందెన్నడూ చూడని రీతిలో ఒక ‘Gen Z’తిరుగుబాటును చూస్తోంది. ఈ Gen Z పోరాట విధానమే వేరు. వాళ్ళు టీవీ చర్చల కోసం ఎదురుచూడరు, రేపటి వార్తాపత్రికల కోసం ఆగరు, తమ ఆర్టికల్‌ను తామే సొంతంగా రాసుకుంటారు. ఒక్క వైరల్ రీల్, ఒక్క పొలిటికల్ మీమ్, ఒక్క పవర్ ఫుల్ స్లోగన్, ఒక్క ఎమోషనల్ వీడియో క్షణాల వ్యవధిలోనే లక్షలాది మందికి చేరిపోతుంది. చాలా వీడియోల్లో విద్యార్థులు నేరుగా ప్రధాని మోదీనే ప్రశ్నించడం కనిపించింది. ఈ పరీక్షల సంక్షోభానికి ప్రధానిని బాధ్యుడిని చేస్తూ నిలదీశారు. ఆ ఆరోపణలు సరైనవా కాదా పక్కన పెడితే ఒక్క సత్యాన్ని మాత్రం ఎవరూ కొట్టిపారేయలేకపోయారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్కులైన ఓటర్లలో ఒక తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమైంది. ఆ ఆగ్రహం కేవలం వీధులకే పరిమితం కాలేదు, ఇన్‌స్టాగ్రామ్‌కు పాకింది, X ను ఊపేసింది, యూట్యూబ్‌లో హోరెత్తింది, ప్రతి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ముంచెత్తింది. రాజకీయ చర్చలు టీవీ స్టూడియోల నుంచి నేరుగా చేతిలోని మొబైల్ ఫోన్లలోకి వెళ్లిపోయాయి. అందుకే గతంలో జరిగిన విద్యార్థి ఉద్యమాలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కేవలం రోడ్లపై జరిగిన ఉద్యమం కాదు, ఇది అల్గారిథమ్స్ నడిపించిన డిజిటల్ విప్లవం. ప్రతి నిరసన ఒక కొత్త కాంటెంట్‌గా మారింది, ప్రతి అరెస్టు ఒక వైరల్ క్లిప్‌గా మారింది, ప్రతి సమరం ఒక ట్రెండింగ్ రీల్‌గా సెన్సేషన్ అయింది. ఏ టీవీ ఛానెల్ టెలికాస్ట్ చేయకపోయినా ప్రతి స్లోగన్ కోట్లాది మందికి చేరువైంది.
అసలైన ట్విస్ట్ సరిగ్గా అప్పుడే ఎదురైంది. కథను మలుపు తిప్పే పెద్ద పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ సీనియర్ నేత ముర్లీ మనోహర్ జోషి రంగంలోకి దిగి “విద్యార్థులతో వెంటనే ప్రభుత్వం చర్చలు జరపాలి” అని బహిరంగంగానే సంచలన విజ్ఞప్తి చేశారు. దీన్ని కేవలం శాంతిభద్రతల కోణంలోనే చూడకూడదని, చర్చలు మాత్రమే పరిష్కారమని తెగేసి చెప్పారు. బీజేపీలోని అత్యున్నత స్థాయి నేతే స్వయంగా మైకందుకుని బహిరంగంగా చర్చల గురించి మాట్లాడారంటే రాజకీయ విశ్లేషకులు దాన్ని ఖచ్చితంగా సాధారణ విషయంగా చూడరు. అంతట్లోనే మరొక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. విపక్షాలు దీన్ని విద్యార్థుల విజయం అని మైలేజ్ తీసుకునే ప్రయత్నం చేశాయి. కానీ ప్రభుత్వం మాత్రం పరీక్షల వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించడం, జవాబుదారీతనాన్ని పెంచడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. దీంతో రాజకీయ విశ్లేషకులు ఒక్కసారిగా ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. అసలు ఏం మారింది? కేవలం కొన్ని రోజుల క్రితం వరకు ఆందోళనలను కఠినంగా అణచివేయాలని భావించిన యంత్రాంగం ఇప్పుడు తమ స్వరాన్ని పూర్తిగా మార్చుకుంది, తమ వ్యూహాన్ని మార్చుకుంది, తమ సందేశాన్ని మార్చుకుంది. ప్రభుత్వం నేరుగా విద్యార్థులతో మాట్లాడటం మొదలుపెట్టింది. స్వయంగా ప్రధానే బ్యాక్-టు-బ్యాక్ సెల్ఫీ-స్టైల్ వీడియోలను విడుదల చేశారు. అటు చూస్తే విద్యాశాఖ మంత్రే పదవి నుంచి తప్పుకున్నారు. ఇదంతా ఒకదానికొకటి లింక్ అయి ఉందా లేక ఇవన్నీ ఒకే సమయంలో అనుకోకుండా జరిగిన వేర్వేరు సంఘటనలా? అసలైన చర్చ మొదలయ్యేది ఇక్కడే!
పరిస్థితి చేయిదాటిపోకముందే Gen Z ఓటర్ల రాజకీయ ప్రాధాన్యతను గుర్తించి ప్రధాని నేరుగా వాళ్లతోనే మైండ్ గేమ్‌కు దిగారని కొందరు విశ్లేషకులు అంటున్నారు. లేక ఇది కేవలం గుడ్ గవర్నెన్స్‌లో భాగమేనని, ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించి సరిగ్గా కమ్యూనికేట్ చేయడమేనని మరికొందరు వాదిస్తున్నారు. కానీ అందరూ కచ్చితంగా ఆలోచించాల్సిన మరో ముఖ్యమైన ప్రశ్న ఉంది. గడిచిన దశాబ్ద కాలంగా ప్రజా ఒత్తిళ్లకు లొంగని ఒక కఠినమైన, ధైర్యవంతుడైన నాయకుడి ఇమేజ్‌ను నరేంద్ర మోదీ నిర్మించుకున్నారు. కానీ ఈ విషయంలో మాత్రం మోదీ మార్క్ కమ్యూనికేషన్ స్టైలే ఊహించని రీతిలో రివర్స్ అయింది. రాజకీయ సందేశం చాలా పర్సనల్‌గా, నేరుగా హృదయాలకు తాకేలా మారింది. ఒకదాని తర్వాత ఒకటి వరుస వీడియోల ప్రవాహం పెరిగింది. ఎప్పుడూ గంభీరంగా ఉండే ప్రభుత్వం ఈసారి చాలా వినమ్రంగా మాట్లాడటం కనిపించింది. ఇది మోదీ అమలు చేస్తున్న సరికొత్త పొలిటికల్ వ్యూహమా లేక ఈ యువజన ఉద్యమానికి ఉన్న అసాధారణ శక్తికి ప్రత్యక్ష నిదర్శనమా? ఎందుకంటే గత కొన్ని వారాల పరిణామాలు నేర్పిన ఒకే ఒక్క పాఠం ఇది. ‘Gen Z’ను తేలికగా తీసుకుంటే రాజకీయంగా మూల్యం చెల్లించుకోక తప్పదు! ఈనాటి యువ ఓటర్లు కేవలం రాజకీయ కథనాలను చూసి ఊరుకునే రకం కాదు, అవసరమైతే ఆ కథనాల రూపురేఖలనే తమకు కావలసినట్లు తిరగరాస్తారు. బహుశా ఈ మొత్తం డ్రామాలో అసలైన ‘బిగ్గెస్ట్ స్టోరీ’ ఇదే కావచ్చు!
Also Read : Gen Z చేతిలో 2029 రాజకీయం.. దేశ భవితను మార్చనున్న 38 కోట్ల మంది ఓటర్లు!
ఇప్పటివరకు ఒకెత్తు, ఇకనుంచి మరోఎత్తు! ఎందుకంటే ఈ స్టోరీ ఇక ఎంతమాత్రం మన టీవీ స్టూడియోలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది గ్లోబల్ పొలిటికల్ న్యూస్‌గా మారిపోయింది! భారతదేశంలో కోట్లాది మంది వేస్తున్న అదే ప్రశ్నను ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పత్రికలు సైతం నేరుగా అడుగుతున్నాయి. ఈ జెన్‌జీ ఉద్యమం నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని తమ పొలిటికల్ స్ట్రాటజీని మార్చుకునేలా చేసిందా? అంతర్జాతీయ మీడియా సంస్థలు అసలు ఏం రాశాయో ఒక్కసారి పరిశీలిద్దాం. రాయటర్స్ సంస్థ ఎప్పుడూ అత్యంత జాగ్రత్తగా, అనవసర సంచలనాలకు తావులేకుండా వార్తలు ఇస్తుంటుంది. అలాంటి గ్లోబల్ మీడియా దిగ్గజం కూడా దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ విద్యార్థుల నిరసనలు, ప్రతిపక్షాలకు మోదీ ప్రభుత్వంపై “ఒక అరుదైన రాజకీయ అవకాశాన్ని” తెచ్చిపెట్టాయని సంచలన రిపోర్ట్ ఇచ్చింది! అంతేకాదు ఉవ్వెత్తున ఎగసిపడిన ఈ నిరసనల వేగాన్ని తట్టుకోవడానికే ప్రధాని మోదీ స్వయంగా సెల్ఫీ-స్టైల్ వీడియోలతో గ్రౌండ్‌లోకి దిగాల్సి వచ్చిందని విశ్లేషించింది!
ఫైనాన్షియల్ టైమ్స్ అయితే అంతకంటే పవర్ ఫుల్ కామెంట్ చేసింది. ఈ Gen Z ఆందోళనలు “నరేంద్ర మోదీ అజేయ శక్తి అనే ఇమేజ్‌ను ఘోరంగా దెబ్బతీశాయి” అని సంచలన వ్యాఖ్య చేసింది! ఒక్కసారి ఆలోచించండి! ‘అజేయ శక్తి’ Aura of Invincibility… దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ పండితులు నరేంద్ర మోదీని తిరుగులేని అగ్రనేతగా అభివర్ణిస్తూ వచ్చారు. కానీ ఈ రోజు ప్రపంచంలోనే టాప్ ఫైనాన్షియల్ పేపర్ ఆ ఇమేజ్‌కి గండిపడిందని చెప్తోంది! అదీ ఏ ప్రత్యర్థి రాజకీయ పార్టీ వల్ల కాదు, భారతదేశపు ‘Gen Z’ యువత వల్ల! ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ పత్రిక ‘లు మాండ్’ కూడా దీనిపై ఒక లోతైన విశ్లేషణ ప్రచురించింది. ఈ యువజన ఉద్యమం ప్రభుత్వాన్ని రాజకీయంగా డిఫెన్స్‌లో పడేసిందని, వరుస నిరసనల ఒత్తిడి తట్టుకోలేకే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందని పేర్కొంది! ప్రజా ఉద్యమాల ధాటికి ప్రభుత్వం తన పొలిటికల్ రూట్‌ను మార్చుకోవాల్సి రావడం మోదీ హయాంలో అత్యంత అరుదైన పరిణామమని వ్యాఖ్యానించింది. ప్రధాని మోదీ ఇటీవల కాలంలో ఎదుర్కొన్న అతిపెద్ద రాజకీయ సవాళ్లలో ఇది ఒకటని ‘ది గార్డియన్’ అభివర్ణించింది! మీమ్స్, షార్ట్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, సోషల్ మీడియా ట్రెండ్స్ ఒక సాధారణ విద్యార్థి పోరాటాన్ని దేశవ్యాప్త రాజకీయ ఉప్పెనలా ఎలా మార్చేశాయో పూసగుచ్చినట్లు వివరించింది.
ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న! దీనర్థం నరేంద్ర మోదీ నిజంగానే డిఫెన్స్‌లో పడిపోయారా? లేనే లేదు! పత్రికలు విశ్లేషణలు మాత్రమే రాస్తాయి. విశ్లేషణ అనేది ఒక అభిప్రాయం మాత్రమే, అది అంతిమంగా నిజం కాదు! కానీ రాయ్టర్స్, ఫైనాన్షియల్ టైమ్స్, లు మాండ్, ది గార్డియన్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలన్నీ ఒక్కసారిగా ఒకే రకమైన ప్రశ్నలను అడుగుతున్నాయంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉందనేది ఇట్టే అర్థమవుతోంది! ఎందుకంటే వాళ్ల ఐడియాలజీలు ఏవైనా వాళ్లంతా వేలెత్తి చూపిస్తోంది ఒకే ఒక్క నిజాన్ని! ప్రభుత్వం తన స్వరాన్ని తగ్గించుకుంది! ప్రధాని తన కమ్యూనికేషన్ స్టైల్‌ని మార్చుకున్నారు! వెంటవెంటనే మూడు సెల్ఫీ-స్టైల్ వీడియోలు విడుదలయ్యాయి! Gen Zని టార్గెట్ చేస్తూ శాంతి వచనాలు పలికారు! చివరకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు! ఇవి కళ్లముందు కనిపిస్తున్న పచ్చి నిజాలు! ఈ నిజాలను అర్థం చేసుకునే విధానంలోనే రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీన్ని ‘రాజకీయ ఓటమి’ అంటే, మరికొందరు ‘స్పందించే నైజం ఉన్న గుడ్ గవర్నెన్స్’ అంటున్నారు. కొందరు ‘డ్యామేజ్ కంట్రోల్’ అంటే, మరికొందరు ‘సమర్థవంతమైన పొలిటికల్ మేనేజ్‌మెంట్’ అని సమర్థిస్తున్నారు.
కానీ ఇక్కడ అసలైన ప్రశ్న ప్రధాని డిఫెన్స్‌లో పడ్డారా లేదా అనేది కాదు! అసలైన బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే.. Gen Z భారత రాజకీయాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌నే మార్చేసిందా? అని! ఎందుకంటే కేవలం చేతిలోని స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా అకౌంట్లు, రోడ్లపై నిరసనలతో మాత్రమే బయల్దేరిన ఒక తరం దేశంలోనే అత్యంత శక్తివంతమైన రాజకీయ యంత్రాంగాన్ని తన వైఖరి మార్చుకునేలా చేయగలిగిందంటే ఈ కథ కేవలం ఒక నిరసన గురించి మాత్రమే కాదు! ఒక మంత్రి రాజీనామా గురించో అసలే కాదు! ఇది భారతదేశంలో ఒక సరికొత్త రాజకీయ శకానికి నాంది కావచ్చు!
రాజకీయాల్లో ఒక పాత సామెత ఉంది! మీరు గెలుస్తున్నప్పుడు మీ శక్తి ఏంటో తెలియదు, ఎదురుదెబ్బ తగిలి స్పందించాల్సి వచ్చినప్పుడే మీ అసలైన పవర్ ఏంటో తెలుస్తుంది! దాదాపు పన్నెండేళ్లుగా నరేంద్ర మోదీ భారత రాజకీయాన్ని ఏకఛత్రాధిపత్యంగా శాసించారు! ప్రతి ఎన్నికను, ప్రతి ప్రచారాన్ని, ప్రతి పొలిటికల్ నరేటివ్‌ను మోదీనే దగ్గరుండి నడిపించారు! మోదీ అసలైన రాజకీయ బలం కేవలం ఎన్నికల గెలుపోటములు మాత్రమే కాదు, Narrativeను తన గుప్పిట్లో ఉంచుకోవడం! సాధారణంగా నరేంద్ర మోదీ ఎంచుకున్న అంశాలపైనే దేశమంతా చర్చలు జరుపుతుంటుంది! కానీ ఈసారి మాత్రం విద్యార్థులు లేవనెత్తిన అంశానికి ప్రధాని మోదీ స్పందించాల్సి వచ్చింది! ఈ మొత్తం డ్రామాలో లభించిన మొదటి బిగ్గెస్ట్ పొలిటికల్ పాయింట్ ఇదే!
Also Read : వినియోగదారులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ధరలు
ఇక రెండో పాయింట్.. దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ ఇప్పుడు తప్పక అర్థం చేసుకోవాల్సిన ఒక నిజాన్ని ఈ ఉద్యమం నిరూపించింది! ‘Gen Z’ అనేది ఇక ఎంతమాత్రం రాజకీయంలో కనిపించని అదృశ్య శక్తి కాదు! ఇన్నాళ్లూ రాజకీయ పార్టీలన్నీ కుల సమీకరణలపైనే దృష్టి పెట్టాయి, మత సమీకరణలను లెక్కవేశాయి, ప్రాంతీయ రాజకీయాలను నమ్ముకున్నాయి! కానీ ఈ ఉద్యమం మరొక కొత్త శక్తిని తెరపైకి తెచ్చింది… అదే డిజిటల్ శక్తి ! నేటి తరం కులంతో ముడిపడి లేదు, మతంతో, భాషలతో విడిపోలేదు, కేవలం ‘ఆల్గొరిధమ్’ ద్వారా వీరంతా ఒకటయ్యారు! ఢిల్లీలో అప్ లోడైన ఒక వైరల్ వీడియో క్షణాల్లో ముంబై వీధులకు చేరింది! పట్నాలో వినిపించిన ఒక నిరసన నినాదం టీవీలో డిబేట్స్ ప్రారంభించేలోపే బెంగళూరు రీచ్ అయిపోయింది! ఇది మునుపెన్నడూ లేని ఒక సరికొత్త పొలిటికల్ ఈకోసిస్టమ్!
ఇక మూడో పాయింట్… అన్నిటికంటే ఆసక్తికరమైనది! నరేంద్ర మోదీని భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతుడైన పొలిటికల్ కమ్యూనికేటర్‌గా పరిగణిస్తారు. అలాంటి మోదీ విడుదల చేసిన ఆ మూడు వీడియోలు కేవలం నిరసనలకు ఇచ్చిన సమాధానాలు మాత్రమే కావు! రాజకీయ కమ్యూనికేషన్ శైలే పూర్తిగా మారిపోయిందని ప్రధాని ఒప్పుకున్నారనడానికి అవి ప్రత్యక్ష సాక్ష్యం! ఏకపక్షంగా సందేశాలు పంపే ‘వన్-వే కమ్యూనికేషన్’ శకం ముగిసిపోయింది! ఇది డిజిటల్ యుగం… ఈనాటి ఓటర్లు కేవలం ప్రసంగాలు విని ఊరుకోరు! వెంటనే రిప్లై ఇస్తారు! క్షణాల్లో స్పందిస్తారు! కొన్నిసార్లు అత్యంత పదునుగా, కొన్నిసార్లు మహా క్రియేటివ్‌గా, కొన్నిసార్లు మీమ్స్ రూపంలో, మరికొన్నిసార్లు నడిరోడ్డుపై నిరసనల రూపంలో స్పందిస్తారు! ప్రస్తుత ప్రభుత్వమైనా, భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వమైనా ఈ కఠిన వాస్తవాన్ని ఎదుర్కొని తీరాల్సిందే!
మరి అన్నిటికంటే పెద్ద పాఠం ఏంటి? ఈ మొత్తం డ్రామా కేవలం ఒక పరీక్షకు సంబంధించినది మాత్రమే కాదు! ఇది ‘నమ్మకానికి’ సంబంధించిన కథ! పరీక్షల వ్యవస్థపై ఉన్న నమ్మకం! రాజ్యాంగ వ్యవస్థలపై ఉన్న నమ్మకం! జవాబుదారీతనంపై ఉన్న నమ్మకం! ఎప్పుడైతే ప్రజల్లో ‘నమ్మకం’ అనేది ప్రశ్నార్థకమవుతుందో అప్పుడు ఎంతటి శక్తివంతమైన ప్రభుత్వమైనా డిఫెన్స్‌లో పడక తప్పదు! అది ప్రతిపక్షాల వల్ల కాదు, కేవలం ప్రజా ప్రతిధ్వని, Public Perception వల్ల మాత్రమే! మరి మోదీ ప్రభుత్వం ఆ కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పునరుద్ధరించగలిగిందా లేదా అనేది కాలమే సమాధానం చెప్తుంది! ఈ నిరసనల సెగ రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపుతుందో లేదో ఓటర్లు మాత్రమే తీర్పు ఇస్తారు! కానీ ఒక్కటైతే స్పష్టంగా జరిగింది! ఈ ఉద్యమం ప్రతి రాజకీయ పార్టీకి ఒక ముక్కుసూటి సత్యాన్ని గట్టిగా గుర్తుచేసింది: ఒక చేతిలో కెమెరా, మరొక చేతిలో ఓటు హక్కు ఉన్న తరాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి! ఈ పరీక్షల వివాదం ఏదో ఒక రోజు ముగిసిపోవచ్చు, కానీ ఇది నేర్పిన రాజకీయ పాఠాలు మాత్రం ఎప్పటికీ మిగిలే ఉంటాయి.









