
మేషం
మంచి వార్తలు వింటారు. డబ్బు ఇబ్బందులు తొలగి ప్రశాంతత లభిస్తుంది. బంధువులు, స్నేహితులు మీకు తోడుగా ఉంటారు. దేవుడి దర్శనం మంచిది.
వృషభం
పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సమస్యలను దాటుకుని సమాజంలో గౌరవం పొందుతారు. దేవుడిని తలుచుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
మిథునం
చిన్నచిన్న సమస్యలు వచ్చినా తెలివిగా అధిగమిస్తారు. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. శివారాధన మేలు చేస్తుంది.
కర్కాటకం
ముందుచూపుతో పనిచేస్తే శ్రమ తగ్గుతుంది. ఆత్మీయుల మద్దతు లభిస్తుంది. అవసరమైన వస్తువులు కొంటారు. గుడికి వెళ్లడం శుభప్రదం.
సింహం
కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. సూర్య నమస్కారాలు చేయడం మంచిది.
కన్య
వ్యాపారం, ఉద్యోగాల్లో మంచి వార్తలు అందుతాయి. ఇంట్లో ఆనందం ఉంటుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం శుభప్రదం.
Also Read : గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. హర్మూజ్‌లో మళ్లీ హైటెన్షన్.. భారీగా పెరగనున్న ధరలు?
తుల
భవిష్యత్తుకు పనికొచ్చే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆంజనేయస్వామిని పూజించడం వల్ల ఆటంకాలు తొలగుతాయి.
వృశ్చికం
అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వేంకటేశ్వరస్వామి దర్శనం మేలు చేస్తుంది.
ధనుస్సు
ఆశించిన రంగాల్లో మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంతో సరదాగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఇష్టదైవాన్ని పూజించండి.
మకరం
ఈరోజు ఫలితాలు సాధారణంగా ఉంటాయి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. గోసేవ చేయడం వల్ల పుణ్యం, శుభం కలుగుతాయి.
కుంభం
పనుల్లో కాస్త ఒత్తిడి ఉన్నా ఓపికగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. శివనామ స్మరణతో మనశ్శాంతి లభిస్తుంది.
మీనం
ముందుచూపుతో వ్యవహరిస్తే విజయాలు మీ సొంతమవుతాయి. పెద్దల సలహాలు పాటిస్తే మంచిది. అప్పుల బాధలు తగ్గుతాయి. దైవ ప్రార్థన శుభప్రదం.
Also Read : దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ ఆకస్మిక సోదాలు: ఉగ్ర కుట్రల మూలాలపై వేటు..









