మేషం
ప్రారంభించిన పనులలో అనవసర శ్రమ పెరగకుండా ప్రణాళికతో ముందుకు సాగాలి. ఆర్థికంగా మిత వ్యయం పాటించడం ఉత్తమం. ఒక కీలక సమస్యకు పరిష్కారం లభించి ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు.

వృషభం
అనుకూల పరిస్థితులు ఉంటాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.

మిథునం
పనులలో ఏకాగ్రత ముఖ్యం. కుటుంబ సభ్యులతో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మనోధైర్యాన్ని తగ్గనీయకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.

కర్కాటకం
పనుల్లో ఆటంకాలు రాకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో మీకు అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల నుంచి సహకారం అందుతుంది.

సింహం
ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. నిర్ణయాల్లో స్థిరత్వం పాటించడం, అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ప్రయాణాలు సూచిస్తున్నాయి.

కన్య
ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ముఖ్యమైన పనులకు ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా విజయవంతంగా పూర్తవుతాయి.

తుల
కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. అవసరమైన సమయంలో ఆర్థికంగా మద్దతు దొరుకుతుంది. శ్రీలక్ష్మీ ఆరాధన వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

Also Read : 19 రోజులుగా ఉపవాసం.. లడఖ్ కోసం సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష.. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే?

వృశ్చికం
బుద్ధిబలం, నిర్ణయశక్తి కలిసివస్తాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పెద్దల ఆదరణ లభిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు.

ధనుస్సు
ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు. ఆర్థిక వృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయి. తోటి వారి సహకారం లభిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి.

మకరం
ఉద్యోగ రంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

కుంభం
శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగాలి. బంధువులతో అనవసర వాదోపవాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది.

మీనం
ఫలితాలు మిశ్రమంగా ఉన్నా పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మేలు.

Also Read : మోటో మావ కుమ్మేశాడు: కొత్త ఫోన్ లాంచ్.. రూ.5వేల భారీ డిస్కౌంట్..!