
మేషం
ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఆశించిన విజయాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు అందుకుంటారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. గణనాయకాష్టకం పఠించడం శ్రేయస్కరం.
వృషభం
ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉత్సాహంతో ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
మిథునం
ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను చేరుకుంటారు. సమయానికి తగిన సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో అనుబంధం బలపడుతుంది. ప్రారంభించిన పనుల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. ఇష్టదైవ ఆరాధన మంచిది.
కర్కాటకం
ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో అధిగమిస్తారు. ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారతాయి. మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మేలు చేస్తుంది. శ్రీలక్ష్మీ స్తోత్రం పఠించడం మంగళప్రదం.
సింహం
సమయోచితంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. పనిభారం పెరుగుతుంది కాబట్టి విశ్రాంతి అవసరం. అనవసర విభేదాలకు దూరంగా ఉండండి. దుర్గాదేవి ధ్యానం ప్రశాంతతను ఇస్తుంది.
కన్య
పెద్దల ఆశీర్వాదం, సహకారం లభిస్తాయి. ఆటంకాలను పట్టుదలతో అధిగమిస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. విషయాలను మనసుకు తీసుకోకండి. హనుమాన్ చాలీసా పఠించడం శ్రేయస్కరం.
Also Read : NTAలో భారీ ప్రక్షాళన..47 మంది అధికారుల ఉద్యోగాలు ఊస్ట్
తుల
అదృష్టం కలిసి వస్తుంది. మీ కృషికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు విజయానికి దారితీస్తాయి. శివారాధన మంగళప్రదం.
వృశ్చికం
ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబంలో చిన్నచిన్న భేదాభిప్రాయాలను సహనంతో పరిష్కరించుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం మంచిది.
ధనుస్సు
మీ తెలివితేటలు అందరినీ ఆకట్టుకుంటాయి. కుటుంబాభివృద్ధికి సంబంధించిన ఆనందకరమైన వార్త వింటారు. ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేస్తారు. ఇష్టదైవ ఆరాధన శ్రేయస్కరం.
మకరం
అవసరమైన సమయంలో సహాయం అందుతుంది. బంధుమిత్రుల సూచనలు ప్రయోజనాన్ని ఇస్తాయి. ప్రణాళిక ప్రకారం ఖర్చులు చేస్తే ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. శివారాధన శాంతిని ఇస్తుంది.
కుంభం
బుద్ధిబలం, సమయస్ఫూర్తితో మంచి ఫలితాలు సాధిస్తారు. సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. కొత్త అవకాశాలు అనుకూలంగా మారతాయి. శని శ్లోకం పఠించడం మంగళప్రదం.
మీనం
అనుకూల పరిస్థితులు ఏర్పడి మనఃశాంతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. గణపతి ఆరాధన శుభఫలితాలను ఇస్తుంది.
Also Read : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తిరస్కరణ: NTAలో భారీ ప్రక్షాళనకు కేంద్రం శ్రీకారం?









