
మేషం
ఆత్మవిశ్వాసం, ధైర్యంతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూల ఫలితాలు లభించి ఆనందాన్ని పొందుతారు. పనిభారం ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో పూర్తి చేస్తారు. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
వృషభం
ఆర్థిక లాభాలు ఉన్నా మనశ్శాంతిని కాపాడుకోవడం అవసరం. కుటుంబ వ్యవహారాల్లో సంయమనంతో వ్యవహరించాలి. పనుల్లో ఓర్పు ఉండాలి. ఆదిత్య హృదయం పఠించడం మేలు చేస్తుంది.
మిథునం
మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని పనులపై దృష్టి పెట్టాలి. కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. నవగ్రహ ఆరాధన శ్రేయస్కరం.
కర్కాటకం
ఆటంకాలను ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం బలాన్నిస్తుంది. ఓర్పుతో వ్యవహరిస్తే అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఇష్టదేవతా స్తోత్రం పఠించడం మంచిది.
సింహం
పనుల్లో పురోగతి ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ప్రయోజనం కలుగుతుంది. సూర్య ఆరాధన చేయడం శుభప్రదం.
కన్య
ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. ఆర్థిక లాభంతో పాటు గౌరవం పెరుగుతుంది. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.
Also Read : పరీక్ష పేపర్ లీకేజీలకు చెక్.. లోక్‌సభలో సవరణ బిల్లు.. అందులో ఏమున్నాయంటే?
తుల
ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది. పనిభారం పెరిగినా సహనంతో విజయం సాధిస్తారు. ధైర్యం కోల్పోకుండా ఉండాలి. విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది.
వృశ్చికం
ఆటంకాలను ధైర్యంతో అధిగమిస్తారు. ముఖ్యమైన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. కృషికి తగిన ఫలితం లభిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శ్రేయస్కరం.
ధనుస్సు
ధైర్యం, ఉత్సాహం కలిసి వస్తాయి. చేపట్టిన పనులు సాఫీగా పూర్తవుతాయి. శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రీరామ నామస్మరణ చేయడం శుభప్రదం.
మకరం
కుటుంబ వ్యవహారాల్లో సంయమనంతో వ్యవహరించడం మంచిది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు తగ్గుతాయి. ఓర్పు, సహనం మేలు చేస్తాయి. శని ధ్యానం శుభప్రదం.
కుంభం
ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది. ప్రశాంతంగా వ్యవహరిస్తే అనుకూల ఫలితాలు పొందుతారు. ఈశ్వర ధ్యానం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది.
మీనం
ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపడకుండా ఆలోచించి ముందుకు సాగాలి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే పనులు పూర్తవుతాయి. మితవ్యయం పాటించడం మేలు. లక్ష్మీదేవి ధ్యానం శుభప్రదం.
Also Read : ట్రెండింగ్‌లో E20 జనతా పార్టీ.. ప్యూర్ పెట్రోల్ కోసం నెటిజన్ల వార్.. అసలు డిమాండ్లు ఇవే!









