
మేషం
అదృష్టం తోడై పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అనుకూలత, వ్యాపారంలో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.
వృషభం
గ్రహబలం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ప్రశంసలు, బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు, స్థిరాస్తి పనుల్లో పురోగతి ఉంటుంది.
మిథునం
రాబడి పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిడి తగ్గించుకుంటే మంచిది.
కర్కాటకం
ఓర్పుతో వ్యవహరిస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారంలో అప్రమత్తత అవసరం.
సింహం
దైవానుగ్రహం, కుటుంబ సభ్యుల సహకారంతో ప్రయత్నాలు ఫలించి పనులు పూర్తవుతాయి.
కన్య
ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. పెట్టుబడులకు, వ్యాపార అభివృద్ధికి మంచి సమయం. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది.
Also Read : న్యూఢిల్లీలో హైడ్రామా.. రాజ్‌ఘాట్‌కు వెళ్లకుండా ప్రతిపక్ష నేతల అడ్డగింత..
తుల
కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
వృశ్చికం
వ్యాపార లాభాలు, పెట్టుబడుల ద్వారా కలసివస్తుంది. ఉద్యోగంలో ప్రతిభకు గుర్తింపు, మిత్రుల మద్దతు లభిస్తాయి.
ధనుస్సు
అభివృద్ధికి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.
మకరం
వ్యాపార విస్తరణకు, ఆర్థిక లాభాలకు అనుకూలం. అప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది.
కుంభం
ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.
మీనం
సరైన ప్రణాళికతో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. బాధ్యతలను సకాలంలో పూర్తి చేసి మెప్పు పొందుతారు. కుటుంబ సూచనలు కలసివస్తాయి.
Also Read : ఓ వైపు ఎల్‌నినో.. మరో వైపు వర్షాలు.. అసలేం జరుగుతోంది?









