
ఉత్తర ప్రదేశ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి మహోబా వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా భయంకరమైన మంటలు చెలరేగి తొమ్మిది మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 నుంచి 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
Also Read : విడాకులు ఇచ్చినా భార్య ఖర్చులు భర్త చూసుకోవాల్సిందే.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు!
DISTURBING VISUALS:
9 killed in Private Sleeper Bus fire on Yamuna Expressway near Jewar, U.P.This latest incident again underlines safety issues with such buses. pic.twitter.com/IqG93vkImv
— Rahul Shivshankar (@RShivshankar) September 24, 2026
వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులో మంటలు ఎలా చెలరేగాయనే విషయం తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూటా లేక మరేదైనా కారణమా అనేది ఇంకా తెలియరాలేదు.
#BREAKING CM #YogiAdityanath expressed grief over a tragic fire on a moving sleeper bus along the #YamunaExpressway claiming 9 lives. He directed prompt medical care and assured all support to affected families.#GreaterNoida #UPNews @myogiadityanath @CMOfficeUP pic.twitter.com/RRNV8WQqox
— jarvis ☠️ (@Vishii14) September 24, 2026
ఈ ఘోర ప్రమాదంపై ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సుమోటోగా స్పందించారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
Also Read : ఇంత గలీజ్ పనులేంట్రా బాబూ.. లిఫ్ట్లోనే మూత్రం పోశాడు!-VIDEO VIRAL









