
Nikita Rawal : సినీ ప్రముఖులకు అభిమానుల నుంచి అప్పుడప్పుడు వింత అనుభవాలు ఎదురవడం కొత్తేమీ కాదు. తాజాగా బాలీవుడ్ నటి నికితా రావల్‌కు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఒక ఈవెంట్‌లో పాల్గొన్న నికితా రావల్ వద్దకు ఓ మహిళా అభిమాని వచ్చి అనుకోకుండా ఆమె పెదవులపై ముద్దు పెట్టుకోవడంతో ఆమె తీవ్ర అసౌకర్యానికి గురైంది. అక్కడ ఉన్న కెమెరాల్లో ఇది రికార్డు కావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇంతకు ఏం జరిగిందంటే.. ఓ ఈవెంట్ కు హాజరైన నికితా రావల్ ఫొటోగ్రాఫర్లకు నవ్వుతూ పోజులు ఇస్తుండగా ఓ మహిళా అభిమాని ఆమె దగ్గరకు వచ్చింది. సదరు అభిమాని నటితో సెల్ఫీ తీసుకోవాలని కోరగా, నికితా కూడా ఎంతో ఆనందంగా ఆమెతో కలసి ఫొటోకు పోజ్ ఇచ్చారు. అంతా బాగానే ఉందనుకునే లోపే, ఆ అభిమాని ఒక్కసారిగా నటి చెంపపై ముద్దు పెట్టుకుని, ఆ వెంటనే ఆమెను తనవైపు తిప్పుకుని పెదవులపై ముద్దు పెట్టుకుంది. ఈ ఊహించని చర్యతో షాక్ అయిన నికితా ఆ అభిమానిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
నికితా రావల్ తీవ్ర అసౌకర్యంగా కనిపిస్తున్నా, ఆ అభిమాని మాత్రం నటిని వదలకుండా పట్టుకుని, అక్కడి నుంచి వెళ్లేముందు మళ్లీ చెంపపై ముద్దు పెట్టుకుని వెళ్లిపోయింది. ఇదంతా కెమెరాల్లో రికార్డు అవ్వడంతో ఈ పట్ల నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా నికితా రావల్ కెరీర్ విషయానికి వస్తే, ఆమె హిందీతో పాటు సౌత్ సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌లో బ్లాక్ అండ్ వైట్, మిస్టర్ హాట్ మిస్టర్ కూల్, ది హీరో – అభిమన్యు, అమ్మ కీ బోలి, గరం మసాలా మరియు క్యూట్ కమీనా వంటి చిత్రాల్లో ఆమె నటించారు.
తెలుగు సినీ పరిశ్రమలోకి 2012లో అడుగుపెట్టిన నికితా తింపా అనే చిత్రంలో విక్రమ్ రాయ్ సరసన ఇచ్చాధారి నాగిని పాత్రలో అలరించారు. ఇక ఆమె తాజా సినిమాల విషయానికొస్తే, త్వరలోనే అర్షద్ వార్సీ, చంకీ పాండేలతో కలసి రోటీ కప్డా ఔర్ రొమాన్స్ అనే సినిమాలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.









