
IPS Uday : హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి, అదే అకాడమీకి చెందిన మరో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
IPS ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. ఎర్రగడ్డ మోతీనగర్‌లోని సోదరుడి ఇంట్లో బలవన్మరణానికి యత్నించారు. దీంతో వెంటనే ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎస్సార్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అంతకుముందు లైంగిక వేధింపులపై తన తప్పు లేదంటూ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వాట్సాప్ స్టేటస్ పెట్టారు.
Also Read : హైదరాబాద్ పోలీస్ అకాడమీలో దారుణం: తోటి మహిళా ఆఫీసర్‌పై ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపులు!
“నాపై వస్తున్న ఫిర్యాదులు, జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం” అని ఆయన పేర్కొన్నారు. తనకు చట్టంపై పూర్తి నమ్మకం ఉందని, చివరికి న్యాయమే గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండా ఎవరూ ఏది పడితే అది ప్రచారం చేయవద్దని, బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఇంతలోనే ఆయన ఇలా సూసైడ్ అంటెప్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
తనను వేధిస్తున్నాడంటూ మహిళా అధికారి ఆదివారం అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందిస్తూ, బాధితురాలి వాంగ్మూలాన్ని తీసుకున్నామని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన వీడియోల ఆధారంగా విచారణ పూర్తి చేసిన కమిటీ ఆరోపణలు నిజమని నిర్ధారించింది. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డిని NPA నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. సస్పెండ్ అవ్వడంతో ఉదయ్ కృష్ణారెడ్డి డిప్రెషన్లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది.
కాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై ఎనిమిది రోజుల్లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు, జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ పర్యవేక్షణలో దర్యాప్తును వేగవంతం చేశారు.
Also Read : చిన్నవయసులో ఉద్యోగ ఒత్తిడి.. అర్థరాత్రి నగ్నంగా పరుగెట్టి చెరువులో దూకి..









