Telangana : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు విచారణలో అత్యంత కీలక ఆధారాలుగా భావిస్తున్న ఆయన సూసైడ్ నోట్‌తో పాటు ఐఫోన్ కూడా మాయమవ్వడం కలకలం రేపుతోంది.

Also Read : రెంట్ బాయ్‌ఫ్రెండ్ పేరుతో కొత్త మోసం.. సజ్జనార్ హెచ్చరిక!

పోలీసుల కస్టడీ విచారణలో ఉదయ్ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాను తీవ్ర మనస్తాపంతో, మద్యం మత్తులోనే ఆ సూసైడ్ నోట్‌ రాసినట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్వయంగా ఉదయ్‌ని విచారించారు. సూసైడ్ నోట్ ఎక్కడ ఉందనే కోణంలో సీపీ సజ్జనార్ ప్రశ్నించగా.. ఆ లేఖ ప్రస్తుతం ఎక్కడుందో తనకు అస్సలు తెలియదని ఉదయ్ కృష్ణారెడ్డి సమాధానమిచ్చారు.

మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి వినియోగించిన ఐఫోన్ కూడా మాయం కావడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫోన్‌లో కేసుకు సంబంధించిన అనేక కీలక ఆధారాలు, సంభాషణలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఐఫోన్ ఎటు పోయింది ఉద్దేశపూర్వకంగానే ఎవరైనా దాచేశారా? లేక మాయం చేశారా? అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు వేగవంతం చేశారు.

Also Read : KCR సంచలన నిర్ణయం..పెద్ది కుటుంబానికి భారీ ఆర్థిక సహాయం!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.