
బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేడు తెలంగాణలో పర్యటించారు. ఇందులో భాగంగా పార్టీ కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. తెలంగాణలో ప్రజా పోరాటాలు, ప్రజా సేవ ద్వారానే రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. మూడు రోజుల పర్యటలో భాగంగా హైదరాబాద్‌కు చేరుకున్న ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికాయి.
Also Read : లండన్‌లో తెలంగాణ విద్యార్థి మృతి.. బర్త్‌డే పార్టీకి వెళ్లిన కొన్ని గంటలకే
Nitin Nabin Telangana Visit
ఈ పర్యటనలో భాగంగా రంగారెడ్డి గ్రామీన జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం శంషాబాద్ వేదికగా నిర్వహించిన సభలో ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, ఆసిఫాబాద్, సిద్దిపేట, మెదక్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల బీజేపీ కార్యాలయాలను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
Hyderabad, Telangana: BJP National President Nitin Nabin says, “I have met many senior party workers and several former district presidents. I would like to pay my respects and extend my greetings to all our senior workers, all the former district presidents, and all the party… pic.twitter.com/fJlkDe2wKu
— IANS (@ians_india) June 28, 2026
Also Read : థార్ కారుపై ఉప్పల్ బాలు డెంజర్ స్టంట్స్.. కేసు నమోదు!
‘‘తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్క కార్యకర్త సమిష్టిగా కష్టపడి పనిచేయాలి. ప్రజల పక్షాన నిలబడి పోరాడాలి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌ను ఉదాహరణగా తీసుకోండి. అక్కడ కార్యకర్తల బలమైన సంకల్పం, సమిష్టి కృషి వల్లే బీజేపీ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అదే స్ఫూర్తిని తెలంగాణలోనూ ప్రదర్శించండి. కష్టం, కృషి ఉంటే కచ్చితంగా సాధించవచ్చు.
ప్రధాని మోదీ నాయకత్వంలో ‘ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్’ లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోంది. త్వరలోనే తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. గతంలో లోక్ సభలో కేవలం 2 సీట్లతో ప్రారంభమైన బీజేపీ నేడు దేశవ్యాప్తంగా తిరుగులేని పార్టీగా దూసుకుపోతోంది. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కూడా బీజేపీ కీలక పాత్ర పోషించింది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. తెలంగాణ కోసం సుష్మాస్వరాజ్ పార్లమెంట్లో గట్టిగా పోరాడారు. బీజేపీ మద్దతుతోనే ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైది.’’ అని ఆయన పేర్కొన్నారు.









