Fake Masala In Hyderabad : హైదరాబాద్‌ మహానగరంలో ప్రతిదీ కల్తీ చేయడం పరిపాటయ్యింది. ఉరుకుల, పరుగుల జీవితంలో ఏం తింటున్నామో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో తినే తిండి మొదలు అన్నీ కల్తీమయమయ్యాయి. తాజాగా నగరంలో మసాలా దినుసులను కల్తీ చేస్తున్న మాఫియా ముఠాలపై  హెచ్-ఫాస్ట్ అధికారులు మెగా ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కల్తీ మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు, అధికారులు వెల్లడించిన వివరాలను బట్టి13 మసాలా యూనిట్లపై అధికారుల సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 25.3 టన్నుల కల్తీ మసాలాలు సీజ్ చేశారు.

Also Read : తుంగతుర్తి వివాదంలో బిగ్‌ ట్విస్ట్‌.. కోమటిరెడ్డి బ్రదర్స్‌ స్ట్రాంగ్ లీడర్స్.. జగ్గారెడ్డి

సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ వెల్లడించిన వివరాల ప్రకారం కేటుగాళ్లుజీలకర్ర, వాము, ఆవాలు, షాజీరా, లవంగాలను కల్తీ చేస్తున్నట్లు గుర్తించారు. ఆయా మసాలాలకు టాల్కమ్ పౌడర్, ఫ్యాబ్రిక్ డైని మిక్స్‌చేసి మసాలాలు కల్తీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనితో పాటు రంగు, బరువు పెంచేందుకు కెమికల్స్ వాడుతున్నట్లు కూడా తేలింది.బేగంబజార్, కాటేదాన్ కేంద్రంగా ఈ  కల్తీ దందా సాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులతో పాటు 89.15 టన్నుల ముడిపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న మాఫియా ముఠాలోని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కల్తీ ఆహార పదార్థాల కేసులపై త్వరలో ప్రత్యేక సిట్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Also Read : ఎల్పీజీ వినియోగదారులకు ‘ఈ-కేవైసీ’ గండం…ఆ పని చేయకపోతే గ్యాస్ కనెక్షన్ కట్

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.