
HYDRAA : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైడ్రా చీఫ్ ఎవి. రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో, ఆయనకు ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలిచింది. కోర్టు ఆదేశాల ప్రక్రియపై సమగ్రమైన చట్టపరమైన అభిప్రాయం (Legal Opinion) తీసుకోవాలని సీఎంతో పాటు ఉన్నతాధికారులు అధికారులను ఆదేశించారు.
ఇటీవల జరిగిన విచారణలో హైకోర్టు సింగిల్ బెంచ్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. హైడ్రా రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 63 సార్లు కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదని, ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడిన అధికారిని ఇంకా అదే బాధ్యతల్లో కొనసాగించడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. రంగనాథ్ స్థానంలో మరొక ఐజీ స్థాయి అధికారిని నియమించడం తప్ప వేరే మార్గం లేదని వ్యాఖ్యానించింది.
Also Read : యశోధ ఆసుపత్రికి కేసీఆర్..పెద్ది సుదర్శన్ రెడ్డికి పరామర్శ
ఈ పరిణామాల వేళ రేవంత్ రెడ్డి సర్కార్ లీగల్ టీమ్‌తో అత్యవసరంగా భేటీ అయి కోర్టు ధిక్కరణ పిటిషన్లను సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు అప్పీలుకు వెళ్లేందుకు ప్రభుత్వం వేగంగా యోచిస్తోంది. హైడ్రా అమలు చేస్తున్న ఆక్రమణల తొలగింపు చర్యల్లో ఐపీఎస్ అధికారి రంగనాథ్ పాత్ర కీలకమని భావిస్తున్న ప్రభుత్వం, ఆయన విషయంలో వెనక్కి తగ్గేది లేదని సంకేతాలు ఇచ్చింది.
ఒకవైపు న్యాయపరమైన సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, మరోవైపు హైడ్రా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హైడ్రా నిర్వహణ, మౌలిక వసతులు, కార్యాచరణ వ్యయాల కోసం రూ. 72 కోట్లు మంజూరు చేస్తూ తెలంగాణ ఆర్థిక శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భారీ నిధుల కేటాయింపుతో సంస్థకు కావలసిన నూతన సాంకేతిక పరికరాలు, సిబ్బంది వేతనాలు, అత్యవసర వాహనాలను కొనుగోలు చేయనున్నారు.
చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు నగరంలో విపత్తు నిర్వహణ (Disaster Management) చర్యలను మరింత పటిష్టం చేసేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని ప్రభుత్వం తెలిపింది. మౌలిక సదుపాయాల కొరత లేకుండా ఏజెన్సీ తన విధులను వేగవంతం చేయడానికి ఈ బడ్జెట్ ఎంతగానో తోడ్పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తున్న ‘హైడ్రా’ చుట్టూ ఇప్పుడు అటు చట్టపరమైన పోరాటం, ఇటు మౌలిక వసతుల విస్తరణ రెండూ సమాంతరంగా సాగుతున్నాయి. హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్‌కు వెళ్లడం ద్వారా రంగనాథ్ పదవిని కాపాడుకోవడంతో పాటు, ఏజెన్సీ కార్యకలాపాలు ఎక్కడా ఆగిపోకుండా బడ్జెట్ విడుదల చేసి పాలనాపరమైన స్పష్టతను ప్రభుత్వం చాటుకుంది.
Also Read : కోమటి రెడ్డి బ్రదర్స్ VS మందుల సామేల్: తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ వర్గపోరు!









