Uday Krishna Reddy Arrest :  మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

Also Read : అమెరికాలో తీవ్ర విషాదం… తెలంగాణ మహిళ మృతి!

ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు దూకుడు పెంచారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, ఆయనకు కోర్టులో ఊరట లభించలేదు. మరోవైపు ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా, తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, చట్టంపై తనకు పూర్తి గౌరవం ఉందని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఉదయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు, అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉంది.

Also Read : పేరు మార్చేసిన ఆ ఒక్క ‘పావలా’ నాటిక.. సీనియర్ నటి శ్యామల లైఫ్ చేంజింగ్ స్టోరీ!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.