
Jagga Reddy : నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాల వ్యవహారంలో కీలక పరిణామం నెలకుంది. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు వివాదంపై విచారణ నిర్వహించిన పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి, తన పరిశీలనకు వచ్చిన అంశాలతో 7 పేజీల సమగ్ర నివేదికను పీసీసీ చీఫ్‌కు అందజేశారు.
Also Read : కల్తీ మసాలా మాఫియా గుట్టురట్టు.. 25.3 టన్నుల కల్తీ మసాలా స్వాధీనం
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన అన్ని వర్గాల నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే తను నివేదిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఎలాంటి పక్షపాతం లేకుండా వాస్తవాలను మాత్రమే నివేదికలో పొందుపరిచినట్లు ఆయన చెప్పుకున్నారు.
Also Read : నైరుతి తుఫాను ధాటికి ముంచెత్తిన వానలు: తెలంగాణలో ఎల్లో అలర్ట్ జారీ
నియోజకవర్గ రాజకీయ వ్యవహారాల్లో ఎమ్మెల్యేదే కీలక బాధ్యత అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాస్. ఎమ్మెల్యే తర్వాతే ఎంపీ, మంత్రులు ఎవరైనా అని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాతే ఇతర ప్రజాప్రతినిధుల పాత్ర ఉంటుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ వ్యవహారాలు కూడా అదే క్రమశిక్షణలో సాగాలని కోరారు.
ఇంకా మాట్లాడుతూ తుంగతుర్తి వివాదంతో పాటు రాజగోపాల్‌కు సంబంధించిన అంశాన్ని కూడా తన నివేదికలో పొందు పరిచినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఎలాంటి విభేదాలు తలెత్తకుండా పార్టీ నాయకత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. —నల్లగొండ జిల్లాలో ఉత్తమ్, జానారెడ్డితో పాటు..కోమటిరెడ్డి బ్రదర్స్ స్ట్రాంగ్ లీడర్స్ అని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. నాయకులంతా సమన్వయంతో పనిచేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పార్టీ కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరగకుండా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిగత విభేదాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తూ, నాయకులు బహిరంగంగా గొడవలకు వెళ్లకుండా సంయమనం పాటించాలని జగ్గారెడ్డి సూచించారు. కాగా, జగ్గారెడ్డి సమర్పించిన ఈ నివేదిక ఆధారంగా తుంగతుర్తి వివాదంపై పీసీసీ నాయకత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.









