
Telangana : తెలంగాణలో ఇటీవల ముగిసిన స్పెషల్ సర్వే (SIR) వల్ల ఏకంగా కోటికి పైగా ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. ఆగస్టు 10తో ఈ సర్వే ముగిసింది. చాలా మంది వివరాలు ఇవ్వకపోవడం, అధికారుల వద్ద పత్రాలు డిజిటల్ రూపంలో లేకపోవడంతో భారీగా ఓట్లు తొలగిపోయే పరిస్థితి వచ్చింది.
Also Read : రాపిడో డ్రైవర్ను అంటూ యువతికి బురిడీ….ఆమె ఇచ్చిన షాక్కు పరార్..
మొత్తం రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉంటే.. కేవలం 2.64 కోట్ల మంది డేటానే ఆన్లైన్ అయ్యింది. మిగిలిన 74 లక్షల మంది తమ పేపర్లు ఇవ్వకపోవడంతో ఆ ఓట్లన్నీ డేంజర్ జోన్లోకి వెళ్లాయి. ఒక్క హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ 43 లక్షలకు పైగా ఓటర్ల వివరాలు అసలు లభించలేదు. వలస వెళ్లిపోవడం, చనిపోవడం, ఒకటికి మించి చోట్ల ఓట్లు ఉండటం ఇందుకు ప్రధాన కారణం.
ఇక ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా తనిఖీ చేస్తే.. ఒకే వ్యక్తికి రెండు, అంతకంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్న కేసులు ఏకంగా 3.18 లక్షలు బయటపడగా ఇవన్నీ తొలగిపోతాయి. గతంలో చేసిన పరిశీలనలో 61 లక్షల ఓట్లలో అడ్రస్లు, వివరాలు తప్పుగా ఉన్నట్లు తేలింది. అయితే పత్రాలు ఆన్లైన్ కాలేదన్నంత మాత్రాన ఓటు శాశ్వతంగా పోయినట్లు కాదు.
Also Read : BRS రాగానే హిల్ట్ పాలసీ రద్దు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
ఎలక్షన్ కమిషన్ ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనుంది. తర్వాత తప్పులున్న ఓటర్లకు అధికారులు నోటీసులు ఇస్తారు. ఆ సమయంలో మీ దగ్గర ఉన్న 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి మీ ఓటును కాపాడుకోవచ్చు. ఒకవేళ నోటీసులు వచ్చినా స్పందించకపోతే మాత్రం ఓటు శాశ్వతంగా రద్దవుతుంది.









