
Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆగస్టు 15 సందర్భంగా వీటిని పంపిణీ చేయా లని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిసారిగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. అయితే రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో లేకపోవడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాష్ర్ట సంక్షేమ పథకానికి ప్రధాని ఫోటో పెట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం వాదిస్తోంది.
ఆగస్టు 15న సంగారెడ్డి జిల్లాలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోనూ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కార్డుల పంపిణీ జరగనుంది. ఇదిలా ఉండగా 9 సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డు మోడల్ ను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. కాగా, ఈ కార్డులో ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి, మరో వైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలను ముద్రించారు. ఇంతవరకు భానే ఉన్నా ఈ ఫోటోల విషయంలోనే వివాదం చెలరేగింది. ఇది రాజకీయ దుమారానికి దారితీసే అవకాశం కనిపిస్తోంది. కార్డులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫోటో లేకపోవడం పట్ల ఆయన సన్ని హితులు అభ్యంతరం వ్యక్తం చేస్తు్న్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి ఫోటో ఖచ్చితంగా ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కార్డులపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో లేకపోవడంపై రాష్ట్ర బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.
Also Read : లక్ష ఇందిరమ్మ ఇళ్లే టార్గెట్.. 12 వేల ఫ్లాట్లతో KPHBలో పైలట్ ప్రాజెక్ట్ షురూ!
ప్రధాని ఫోటో ఉండాల్సిందే
రేషన్ కార్డులపై కేవలం సీఎం రేవంత్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ ఫోటోలు మాత్రమే ముద్రించడాన్ని బీజేపీ ఫైర్ అవుతోంది. స్మార్ట్ కార్డులపై ప్రధాని మోడీ ఫోటో పెట్టకపోవడం పట్ల తెలంగాణ బీజేపీ నేతలుఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ బియ్యం పంపిణీలో ప్రజలకు ఇచ్చే ఆరు కిలలలో ఐదు కిలోలు కేంద్రానివేనని అలాంటప్పుడు ఎవ్వనయ్యజాగీరని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు మాత్రమే ఎలా వేసుకుంటారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటుగా విమర్శించారు. ఇక పేదలకు ఇచ్చే ఉచిత రేషన్ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం తమ ప్రచారం కోసం సీఎం, మంత్రి ఫోటోలు వేసుకోవడం హాస్యాస్పదమని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. అసలు వారి ఫోటోలు వేసుకోవలసిన అవసరం ఏంటని, భవిష్యత్ లో ఈ ప్రభుత్వం దిగిపోయాక మళ్లీ కొత్త కార్డులు ఇవ్వాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు ప్రధాని మోడీ ఫోటో లేకుండా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని మెదక్‌ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా తప్పు పట్టారు. రాష్ట్రంలో ఒక్కో లబ్ధిదారుడికి ఇచ్చే 6 కిలోల బియ్యంలో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని ఆయన గుర్తు చేశారు. అలాంటప్పుడు మోడీ ఫోటో పెట్టకపోవడం కేంద్రాన్ని అవమానించడమే అని ఆయన విమర్శించారు. అంతేకాక సంగారెడ్డిలో ముఖ్యమంత్రి పంపిణీ సభలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దానికి బీజేపీని బాధ్యులను చేయవద్దని రఘనందన్‌రావు హెచ్చిరించారు. రేవంత్ ప్రభుత్వానికి పని తక్కువ.. ప్రచారం ఎక్కువ అంటూ సెటైర్ వేశారు. కాగా శనివారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనున్నగా భట్టి, మోడీ ఫోటోల పై చెలరేగిన పొలిటికల్ వివాదం ఎలాంటి ఉద్రిక్తతలకు దారితీస్తుందోనని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
Also Read : తెలంగాణలో అదిరిపోయే కొత్త స్కీమ్.. ఒక్కో మహిళకు రూ.12 వేలు.. వివరాలివే!









