Nandigam Surendra Pattabhirama Rao : హైకోర్టు ప్రముఖ సీనియర్ న్యాయవాది నందిగం సురేంద్ర పట్టాభిరామారావు ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులలో ఎంతో పేరుప్రఖ్యాతులు పొందిన సీనియర్ న్యాయవాదులలో ఒకరు. సివిల్, రాజ్యాంగ (Constitutional), అనేక సంక్లిష్టమైన చట్టపరమైన అంశాలపై ఆయనకు విశేషమైన పట్టు ఉండేది. ఎంతో మంది జూనియర్ న్యాయవాదులకు ఆయన మార్గదర్శకుడిగా వ్యవహరించారు. కాగా నందిగం సురేంద్ర పట్టాభిరామారావు OPDR మాజీ కన్వీనర్ గా పనిచేశారు.

Also Read : 2034 వరకు సీఎంగా ఉంటా.. ఏం డౌట్ వద్దు : సీఎం రేవంత్ రెడ్డి

ఆయన మృతి పట్ల హైకోర్టు న్యాయవాదుల సంఘం (High Court Advocates Association), పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. న్యాయరంగానికి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ సంతాపం తెలిపారు.వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సాయంత్రం 4 గంటలకు పంజాగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.

Also Read : తెలంగాణలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన సర్కార్!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.