
CM Revanth: తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చే్స్తోంది. వాటితో పాటు నూతన పింఛన్ల పంపిణీ, అసంఘటిత రంగంలోని గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తీసుకొచ్చిన చట్టాన్ని కూడా అదే రోజు నుంచి అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు అందజేసేందుకు వీలుగా క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన 1.06 కోట్ల లామినేటెడ్ ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) రేషన్ కార్డులను ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపించింది. వాటిని ఆగస్టు 15న ఆయా జిల్లాల మంత్రులు, అధికారులు లబ్ధిదారులకు అందజేస్తారు.
ఇక కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులందరికీ కూడా నూతన పింఛన్లు మంజూరు చేయాలని, దివ్యాంగులైన పింఛనుదారులు మరణిస్తే వారి భార్యలకు తక్షణమే ఆ ప్రయోజనం వర్తింపజేయాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ పాటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు తలసేమియా, సికిల్‌సెల్ అనీమియా రోగులకు కూడా సామాజిక పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆమేరకు లబ్ధిదారుల ఎంపికను అధికారులు చేపట్టారు.
Also Read : నిరుద్యోగులకు HYDRAA శుభవార్త.. టెన్త్ అర్హతతో ఎగ్జామ్ లేకుండా జాబ్స్.. రేపు, ఎల్లుండే ఛాన్స్!
కాగా, అధికారిక గణాంకాల ప్రకారం.. 2025 జనవరి 1 నాటికి రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 54,66,844 కార్డులు, రాష్ట్ర ఆహార భద్రత కింద 35,28,438 కార్డులు కలిపి మొత్తంగా 89,95,282 రేషన్ కార్డులు ఉన్నాయని తేలింది, వాటిలో 2,81,47,565 మంది లబ్ధిదారులుగా ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. ఇలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 26 జనవరి 2025 నుంచి 21 జులై 2026 మధ్య కాలంలో 16,32,810 కొత్త రేషన్ కార్డులను జారీ చేసింది. దీంతో పాటు పాత కార్డుల్లో 20,27,519 కొత్త సభ్యుల పేర్లను కూడా చేర్చింది. అలా మార్పులు చేర్పులు, సభ్యుల తొలగింపులు అన్ని కలిపి ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,06,28,092 రేషన్ కార్డులు అందుబాటులో ఉన్నాయని అధికారులు గుర్తించారు, మొత్తంగా 3,42,57,109 లబ్ధిదారులు ఉన్నారు. వారందరి కుటుంబాలకు లామినేటెడ్ స్మార్ట్ కార్డులను ప్రజాప్రతినిధుల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మరోవైపు సామాజిక భద్రతా పింఛన్ల (చేయూత) కోసం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 11 వేర్వేరు కేటగిరీలను ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో ఉన్న 41,35,917 మంది లబ్ధిదారులున్నారు. వారికి ప్రతి నెలా రూ. 2,933.35 కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయిస్తూ వస్తోంది. ఈ బడ్జెట్ ఆధారంగా దివ్యాంగులకు నెలకు రూ.4,016 చొప్పున, మిగిలిన 10 విభాగాల లబ్ధిదారులకు నెలకు రూ.2,016 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. వర్గాల వారీగా పరిశీలిస్తే.. వృద్ధులు 14,48,301 మంది, వితంతువులు 14,82,267 మంది, దివ్యాంగులు 4,74,148 మంది లబ్ధిదారులుగా ఉన్నారు. అందుతున్నాయి. వీరే కాక, గీత కార్మికులు 59,981 మంది, చేనేత కార్మికులు 34,093 మంది, హెచ్‌ఐవీ, -ఏఆర్‌టీ బాధితులు 47,076 మంది, ఫైలేరియా రోగులు 16,974 మంది, డయాలసిస్ పేషెంట్లు 10,360 మంది, బీడీ కార్మికులు 4,20,499 మంది, ఒంటరి మహిళలు 1,38,459 మంది, బీడీ ఠేకేదార్లు 3,759 మంది ఉన్నారు. వీరందరికీ పింఛన్లు అందించాల్సి ఉంది. అలాగే వృద్ధాప్య పింఛనుదారుల మరణానంతరం వారి జీవిత భాగస్వాములకు పింఛను మంజూరు చేస్తోంది. అలా గత నెలలో 3,085 మందిని కొత్తగా లబ్ధిదారులుగా గుర్తించారు. దివ్యాంగుల పింఛన్ల మంజూరు చేయడం కోసం ‘యూనివర్సల్ డిసేబిలిటీ ఐడీ అసెస్‌మెంట్’ క్యాంపులను ఏర్పాటు చేశారు. ప్రాథమికంగా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2.5లక్షల మందికి పింఛన్ల మంజూరు చేయడానికి రాష్ర్ట ప్రభుత్వం సిద్ధమైంది. వీరిలో 6వేల మంది తలసేమియా బాధితులు, 1700 మంది సికెల్‌సెల్, ఎనీమియా బాధితులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక అతిముఖ్యమైన అంశంగిగ్ వర్కర్ల చట్టం.. డెలివరీ బాయ్స్, రవాణా కార్మికులకు భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన గిగ్ వర్కర్ల చట్టాన్ని కూడా ఆగస్టు 15 నుంచే అమలు చేసేందుకు కార్మిక శాఖ నిర్ణయించింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ గిగ్ వర్కర్ల భద్రత కోసం ఈ నెల 15 నాటికి సంక్షేమ బోర్డు సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న వేతన కోతలు, యాప్‌ల ఆల్గారిథమ్స్ ఆధారిత ఆంక్షలకు సంబంధించి కొత్త చట్టంలో ప్రభుత్వం కఠిన నిబంధనలను రూపొందించినట్లు తెలుస్తోంది. యాప్‌లు, ఆల్గారిథమ్‌ల ద్వారా గిగ్ వర్కర్ల పేమెంట్లు నిలిపివేయడం, కారణం లేకుండా ఐడీలు బ్లాక్ చేయడం, అనవసర కోతలు విధించడం వంటి అగ్రిగేటర్ల చర్యలకు అడ్డు కట్టవేయడానికి ఈ చట్టం దోహడపడుతుంది. పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా అయా జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా నూతన కార్డులు, పింఛన్ ప్రొసీడింగ్ పత్రాలు అందించడానికి మండల కేంద్రాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read : నా మొగున్ని చంపుతావా? లేక నన్ను చావామంటావా?









