Telangana : పనీర్‌ పేరుతో నకిలీ ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అనలాగ్‌, నాన్‌ డెయిరీ, ఆర్టిఫిషియల్‌ పనీర్‌ తయారీ, అమ్మకాలపై నిషేధం విధించింది. ఈ నిషేధం రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు అమల్లో ఉంటుందని టీజీ సేఫ్‌ ప్రకటించింది.

Also Read : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో సంచలన ట్విస్ట్!

సెప్టెంబర్‌ 10 నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఇకపై పనీర్‌ పేరుతో ఇలాంటి ఉత్పత్తులను తయారు చేయడం, ప్రాసెసింగ్‌ చేయడం, ప్యాకింగ్‌ చేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం, పంపిణీ చేయడం, విక్రయించడం చేయకూడదని స్పష్టం చేసింది. ప్రజలకు అందే ఆహారం నాణ్యంగా, సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీజీ సేఫ్‌ వెల్లడించింది.

ఈ నిషేధం ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ యాక్ట్‌-2006లోని సెక్షన్‌ 30(2)(a) కింద విధించినట్లు తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. పనీర్‌ పేరుతో అసలు పాలతో తయారు చేయని ఉత్పత్తులను విక్రయిస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వ్యాపారులు నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.

Also Read : తెలంగాణలో ఎమర్జెన్సీ తరహా వాతావరణం.. గవర్నర్ కు ఫిర్యాదు చేశాం.. కేటీఆర్

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.