
Telangana : తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) మొత్తం 7,437 పోస్టుల భర్తీకి నాలుగు నోటిఫికేషన్లు జారీ చేసింది. పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్, జైలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్సై 148, కానిస్టేబుల్ (సివిల్) 3,697, కానిస్టేబుల్ (ఏఆర్) 1,052, SPF కానిస్టేబుల్ 1,380, SPF ఎస్సై 44, ఫైర్ ఫైటర్స్ 751 ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాలకు https://www.tgprb.in/ లింక్ను క్లిక్ చేయండి.









