
అమెరికాకు చెందిన 48 ఏళ్ల బిలియనీర్ బ్రయాన్ జాన్సన్ యంగ్‌గా ఉండటానికి సరికొత్త ప్రయోగం చేశారు. ఎప్పుడూ యువకుడిలా కనిపించి.. మృత్యువును జయించడానికి ఓ ప్రయోగం చేసినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వయస్సు పెరగకుండా.. ఎప్పుడు ఆరోగ్యంగా ఉండటానికి తాను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి రూపంతో ఒక ‘క్లోన్’ను సృష్టించుకున్నట్లు ప్రకటించారు.
Also Read : ఇరాన్‌పై అమెరికా బిగ్ ఎటాక్.. డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!
I just cloned myself…as a newborn
With this clone, I can:
+ become my own blood boy
+ test therapies on the clone
+ grow organs for transplantation
+ develop new treatments
+ inject young cellsThis baby-bryan lives in a petri dish for now.
This may be scary to some… pic.twitter.com/Ved8ij9Col
— Bryan Johnson (@bryan_johnson) July 21, 2026
Also Read : భారత్‌కు బిగ్ రిలీఫ్.. 60 దేశాలపై అమెరికా టారిఫ్ బాంబు.. వీటి వెనుక ట్రంప్ అసలు ప్లాన్ ఇదే!
ఈ వినూత్న ప్రయోగంలో భాగంగా తాను నవజాత శిశువుగా ఉన్నప్పటి స్థితిలో ‘బేబీ-బ్రయాన్’ అనే క్లోన్‌ను రూపొందించానని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ క్లోన్ ఒక ల్యాబొరేటరీకి చెందిన ‘పెట్రీ డిష్’లో పెరుగుతోందని జాన్సన్ వెల్లడించారు. సాధారణంగా సాంకేతిక రంగంలోనూ, వైద్య విధానాల్లోనూ క్లోనింగ్ పద్ధతిపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. కానీ ఆయన దీనికి సపోర్ట్ చేస్తున్నారు. కొందరికి ఈ ప్రయోగం కాస్త భయంకరంగా అనిపిస్తుంది. అయితే ఈ బేబీ బ్రయాన్ క్లోన్‌ను ఎలా సృష్టించారనే విషయాన్ని పూర్తిగా వెల్లడించారు.
ఈ బేబీబ్రయాన్ క్లోన్ పద్ధతిలో ఫస్ట్ అతని శరీరం నుంచి రక్తాన్ని తీస్తారు. ఆ తర్వాత అందులో ఉన్న ముఖ్య కణాలను వేరు చేస్తారు. ఆ తర్వాత ఆ కణాలను పునరుద్ధరించి.. మళ్లీ తల్లి కడుపులోని పిండం వంటి ప్రాథమిక స్థితిలోకి తీసుకెళ్తారు. ఈ క్లోనింగ్ పద్ధతి ద్వారా భవిష్యత్తులో తన శరీరానికి అవసరమైన యువ కణాలను ఎక్కించుకోవచ్చు. అంతే కాకుండా అవసరమైనప్పుడు సొంత అవయవాలను కూడా పెంచుకుని అవయవ మార్పిడి చేసుకోవచ్చు. కొత్తగా కనుగొనే ప్రయోగాత్మక వైద్య చికిత్సలను నేరుగా తనపై కాకుండా.. ఈ క్లోన్‌పై పరీక్షించి ఫలితాలను విశ్లేషించవచ్చని జాన్సన్ తెలిపారు.
అయితే బ్రయాన్ జాన్సన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ కారణం ఉంది. ఇటీవల ఆయన ఒక అరుదైన ‘ఆటోఇమ్యూన్ గాస్ట్రైటిస్’ (AIG) బారిన పడ్డాడు. ఈ వ్యాధి వచ్చిన వారికి రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. అది కడుపులో ఉన్న సున్నితమైన పొరపై దాడి చేసి దెబ్బతీస్తుంది. ప్రస్తుత దీనికి ఎలాంటి మందులు లేవు. ఈ క్రమంలోనే క్లోనింగ్ మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆయన తెలిపారు.
పార్కిన్సన్స్ వంటి తీవ్రమైన నరాల సంబంధిత వ్యాధులకు డోపమైన్ న్యూరాన్‌లను పునరుద్ధరించడానికి ఈ సాంకేతికత ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ దశలో ఉందని జాన్సన్ తెలిపారు. తాను అనారోగ్యానికి గురి కావడం కూడా తన మంచికేనని అన్నారు. దీని వల్ల బాడీని సరికొత్తగా మార్చుకోవడంతో పాటు వృద్ధాప్యాన్ని అడ్డుకునేందుకు దారి దొరికిందన్నారు.









