Bangladesh :  బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో చైనా తయారీ ట్యాంక్ పేలిపోవడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. చైనాకు చెందిన టైప్-59 ట్యాంక్ పేలుడు ఘటనలో ఇద్దరు బంగ్లాదేశ్ సైనికులు మృతి చెందగా.. ఓ ఆర్మీ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మేడ్ ఇన్ చైనా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read : షేక్ హసీనా కుమార్తె సంచలన నిర్ణయం.. WHO పదవికి రాజీనామా!

బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో హతజారి ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో సైనిక విన్యాసాలు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ట్యాంక్ నుంచి కాల్పులు జరుపుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ట్యాంక్‌లో ఉన్న ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోగా.. మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆర్మీ అధికారికి వెంటనే చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను ప్రత్యేక విమానంలో ఢాకాలోని కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్‌కు తరలిస్తున్నారు.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో చైనా ఉత్పత్తుల నాణ్యతపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మేడ్ ఇన్ చైనా అంటే ఇదేనా?, చైనా పీస్‌ను నమ్ముకుని యుద్ధానికి వెళ్తే ఇలాగే ఉంటుందిఅంటూ ట్రోల్ చేస్తున్నారు. యుద్ధంలో ఉపయోగించే ఆయుధాలు, ట్యాంకులు నాణ్యమైనవి కాకపోతే సొంత సైనికులకే ప్రమాదం తప్పదంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ట్యాంక్ ఎందుకు పేలిందన్న అసలు కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ తెలిపింది. కాబట్టి ట్యాంక్ నాణ్యత కారణంగానే పేలుడు జరిగిందని ఇప్పుడే నిర్ధారించలేమని కూడా గమనించాలి. అయినప్పటికీ ఈ ఘటన సోషల్ మీడియాలో చైనా ఆయుధాలపై మరోసారి చర్చకు దారితీసింది.

Also Read : పిల్లల్ని కనండి.. ఖర్చులన్నీ మేమే చూసుకుంటాం.. చైనా సంచలన ప్రకటన!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.