China : చైనాలోని చింగ్డావో బెహై షిప్‌యార్డ్‌లో ఓ నౌకలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో ఐదుగురి ఆచూకీ గల్లంతయింది. లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ‘ఓషన్‌ మెలోడీ’ అనే సరుకు రవాణా చేస్తున్న నౌక.. మరమ్మతుల కోసం చింగ్డావో బెహై షిప్‌యార్డ్‌లో నిలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ సమయంలోనే నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 42 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : పగలు TV యాంకర్.. రాత్రైతే అదే పని.. ఆమెకు ఉరిశిక్ష..!

ప్రమాదం జరిగిన వెంటనే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ స్పందించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అగ్నిప్రమాదానికి దారితీసిన కారణాలపై త్వరితగతిన దర్యాప్తు చేపట్టాలని, బాధితులకు సాయం అందించాలని జిన్‌పింగ్‌ సూచించారు. మరోవైపు, ఈ నౌకలో చిక్కుకున్న సిబ్బందిని రక్షించడంతో పాటు , గాయపడిన వారికి చికిత్స అందించడంపై సిబ్బంది దృష్టి పెట్టాలని చైనా ప్రధాని లీ కియాంగ్ అత్యవసర బృందాలను ఆదేశాలు జారీ చేశారు.

కాగా ప్రమాదం జరిగిన చింగ్డావో బెహై అనేది ‘చైనా స్టేట్ షిప్‌బిల్డింగ్ కార్పొరేషన్’ ఆధ్వర్యంలోని నిర్వహిస్తున్న ప్రధాన షిప్‌యార్డ్. ఇక్కడ వాణిజ్య నౌకల నిర్మాణం, మరమ్మతులు తదితర పనులు చేస్తుంటారు. తీరప్రాంతం వెంబడి 9 కిలోమీటర్ల మేర 815 ఎకరాల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : చంద్రునిపై జనావాసాలు.. నాసా – ఇస్రో బిగ్ ప్లాన్..

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.