iraq

IRAQ : ఇరాక్ దేశానికి చెందిన మహిళా రాజకీయ నాయకురాలు హింద్ అల్-అబ్బసి ఇంట్లో అక్కడి పోలీసులు జరిపిన తనిఖీల్లో ఆస్తి దొరికిందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ తిరుగుతోంది. ఆమె ఇంట్లో ఏకంగా 57 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ. 490 కోట్లు అన్నమాట. నగదుతో పాటు 27 కిలోల బంగారం దొరికినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, పూర్తిగా బంగారంతో చేసిన లోదుస్తులు కూడా పోలీసులు పట్టుకున్నారంటూ కొన్ని ఫోటోలు, పోస్టులు ఇంటర్నెట్‌లో విపరీతంగా షేర్ అవుతున్నాయి. నోట్ల కట్టలు, బంగారు బిస్కెట్ల ఫోటోలను వీటికి జత చేయడంతో జనం ఈ వార్తను చూసి నోరెళ్లబెడుతున్నారు.

అయితే ఈ వైరల్ వార్తపై ఇరాక్ ప్రభుత్వం గానీ, అక్కడి అధికారులు గానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో తిరుగుతున్న ఫోటోలకు, దొరికినట్లు చెబుతున్న వస్తువుల లిస్టుకు హింద్ అల్-అబ్బసికి నిజంగానే సంబంధం ఉందా లేదా అనే విషయానికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు.

మరోవైపు ఆలియా అని పిలిచే ఇంకొక ఇరాక్ మహిళా లీడర్ ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేశారని, అక్కడ భారీగా డబ్బు, బంగారం దొరికాయని మరికొన్ని వార్తలు చెబుతున్నాయి. నెట్టింట తిరుగుతున్న ఆ బంగారు వస్తువుల ఫోటోలు హింద్ అల్-అబ్బసివి కావు, బహుశా అవి ఆ ఆలియాకు సంబంధించినవి అయి ఉండవచ్చని అనుకుంటున్నారు. ఏదేమైనా ఈ రెండు విషయాలపై ఇరాక్ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.