

AI : ఏఐ మన మెదడును వీక్ చేస్తోందా? ఒక్కసారి ఊహించండి. మీరు ఇప్పుడే ఒక పెద్ద మెసేజ్ టైప్ చేశారు. సెండ్ చేశారు రెండు నిమిషాల తర్వాత ఎవరో మిమ్మల్ని అడిగారు. ఇప్పుడే ఏం రాశావో చెప్పగలవా? మీకు గుర్తు రావడం లేదు. వింతగా అనిపిస్తోంది కదా? కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇదే ప్రశ్న సీరియస్ గా చర్చకు వస్తోంది. ఏఐ మనల్ని స్మార్టర్ చేస్తోందా? మన ప్రొడక్టివిటీ పెంచుతోందా? లేక మనం చేయాల్సిన థింకింగ్ పని మొత్తాన్ని క్రమంగా ఏఐకి అప్పగిస్తున్నామా? ఎంఐటీ నుంచి వచ్చిన రెండు రీసెంట్ స్టడీస్ ఈ డిబేట్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చాయి. ఒక స్టడీలో చాట్‌జీపీటీ ఉపయోగించి రాసేటప్పుడు మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో చూశారు. మరో స్టడీలో ఏఐని ఉపయోగించి ఫేక్ న్యూస్ ను గుర్తించేటప్పుడు ఏమవుతుందో పరిశీలించారు. రెండు స్టడీస్ లోనూ ఒకే అన్‌కంఫర్టబుల్ క్వశ్చన్ కనిపిస్తోంది. ఏఐ ఎక్కువ పని చేస్తుంటే… మన కాగ్నిటివ్ స్కిల్స్ కు ఏమవుతుంది? అయితే మొదట ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్. ఈ స్టడీస్ ఆధారంగా… ఏఐ మన బ్రెయిన్ ను డ్యామేజ్ చేస్తోంది అని చెప్పడానికి ఇప్పటికీ సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. ఇక, మొదటి ఎంఐటీ స్టడీ ఒక ప్రీప్రింట్. అంటే అది ఇంకా ఫైనల్ పీర్-రివ్యూడ్ రిసెర్చ్ కాదు. శాంపుల్ సైజ్ కూడా రిలేటివ్‌గా స్మాల్. కాబట్టి ఇది ఫైనల్ వెర్డిక్ట్ కాదు.
ఒక వార్నింగ్ సిగ్నల్ అంతే! మొదటి ఎంఐటీ ఎక్స్‌పెరిమెంట్ ఏం చెప్పింది? ఎంఐటీ రిసెర్చర్స్ పార్టిసిపెంట్స్ ను మూడు గ్రూప్స్ గా విభజించారు. మొదటి గ్రూప్… చాట్‌జీపీటీలాంటి ఎల్‌ఎల్‌ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఉపయోగించి ఎస్సేస్ రాయాలి. రెండో గ్రూప్… సెర్చ్ ఇంజిన్ ఉపయోగించాలి. మూడో గ్రూప్… ఏ ఎక్స్‌టర్నల్ టూల్ ఉపయోగించకూడదు. సొంత బ్రెయిన్ తోనే ఎస్సే రాయాలి. రిసెర్చర్స్ ఎస్సే ఎంత బాగా రాశారో మాత్రమే చూడలేదు. వాళ్లు ఈఈజీ టెక్నాలజీ ఉపయోగించారు. అంటే… ఎస్సే రాస్తున్న సమయంలో బ్రెయిన్ లో డిఫరెంట్ ఏరియాస్ ఎలా కమ్యూనికేట్ అవుతున్నాయో మెజర్ చేశారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపించింది. బ్రెయిన్- ఓన్లీ గ్రూప్ లో స్ట్రాంగెస్ట్ అండ్ మోస్ట్ వైడ్‌లీ డిస్ట్రిబ్యూటెడ్ న్యూరల్ కనెక్టివిటీ కనిపించింది. సెర్చ్ ఇంజిన్ గ్రూప్ మధ్యలో ఉంది. ఎల్‌ఎల్‌ఎం గ్రూప్ లో ఓవరాల్ కనెక్టివిటీ తక్కువగా కనిపించింది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దీని అర్థం… చాట్‌జీపీటీ వాడితే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందని కాదు! రిసెర్చర్స్ ఆబ్జర్వ్ చేసింది ఏమిటంటే… ఒక టాస్క్ లో టెక్నాలజీ ఎంత ఎక్కువ పని చేస్తే… ఆ టాస్క్ సమయంలో మెజర్డ్ బ్రెయిన్ ఎంగేజ్‌మెంట్ కూడా అంత తక్కువగా కనిపించింది. సింపుల్‌గా చెప్పాలంటే… పని మనం ఎంత చేస్తాం పని ఏఐ ఎంత చేస్తుంది? అనేదానితో కాగ్నిటివ్ ఎంగేజ్‌మెంట్ కు సంబంధం ఉండొచ్చన్నది ఈ రిసెర్చ్ సూచిస్తోంది.
కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. సొంత ఎస్సే కూడా గుర్తుండలేదా? రిసెర్చర్స్ బ్రెయిన్ యాక్టివిటీ మాత్రమే చూడలేదు. పార్టిసిపెంట్స్ రాసిన ఎస్సేస్ గురించి కూడా వాళ్లను ప్రశ్నించారు. ఇక్కడ ఎల్‌ఎల్‌ఎం ఉపయోగించిన పార్టిసిపెంట్స్… తాము రాసిన కంటెంట్ ని యాక్యురేట్‌గా రీకాల్ చేయడంలో ఎక్కువగా స్ట్రగుల్ చేశారు. అంటే… ఎస్సే వాళ్ల పేరు మీద ఉంది. కానీ… మీరు దాంట్లో ఏం రాశారు? అని అడిగితే చెప్పడం కష్టం అయింది ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక ఆన్సర్ రాశారు. పేపర్ సబ్మిట్ చేశారు. తర్వాత ఎగ్జామినర్ అడిగాడు… మీరు ఏం రాశారో చెప్పండి? మీకు గుర్తు లేదు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. మీరు నిజంగా ఏదైనా నేర్చుకున్నారా? లేక… ఒక అవుట్‌పుట్ మాత్రమే పొందారా? ఎంఐటీ రిసెర్చర్స్ దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి “కాగ్నిటివ్ డెబ్ట్” అనే కాన్సెప్ట్ ను ఉపయోగిస్తున్నారు. అంటే… ఈరోజు ఏఐ మీ పని సులభం చేసింది. కానీ… ఆ పనిలో మనం చేయాల్సిన మెంటల్ ఎఫర్ట్ని రిపీటెడ్‌లీ ఏఐకి అప్పగిస్తే… దానికి లాంగ్-టర్మ్ కాగ్నిటివ్ కాస్ట్ ఉండొచ్చా? అనేది ప్రశ్న. కానీ ఇక్కడ ఒక బిగ్ క్యాచ్ ఉంది ఇక్కడే కొన్ని హెడ్‌లైన్స్ చాలా సెన్సేషనల్ గా మారిపోయాయి.
Also Read : ఇరాన్ పై మరో భీకర దాడికి స్కెచ్.. అమెరికా ఇచ్చిన 5 సిగ్నల్స్ ఇవే!
చాట్‌జీపీటీ ఈజ్ మేకింగ్ యూ స్టూపిడ్. ఏఐ ఈజ్ డిస్ట్రాయింగ్ యువర్ బ్రెయిన్ అని తీర్పుచెప్పడం మొదలైంది. ఈ పద్ధతిలో కామెండ్ చెయ్యడం సైంటిఫిక్ కన్‌క్లూజన్ మాత్రం కాదు. మొదటి స్టడీలో ఇనిషియల్ సెషన్స్ లో 54 పార్టిసిపెంట్స్ ఉన్నారు. నాలుగో సెషన్లో 18 మంది ఉన్నారు. అంతేకాదు… ఈ పేపర్ అప్పటికి పీర్ రివ్యూ పూర్తి చేసుకోలేదు. పార్టిసిపెంట్స్ కూడా రిలేటివ్‌గా లిమిటెడ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు. కాబట్టి ఒక్క ఈ స్టడీ ఆధారంగా… ఏఐ అందరినీ తెలివి తక్కువ వాళ్లుగా చేస్తోంది అని చెప్పలేం. కానీ… ఈ ఎక్స్‌పెరిమెంట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మాత్రం లేవనెత్తింది. అది… ఏఐ మన కోసం ఎంత ఎక్కువగా ఆలోచిస్తే… మనం ఎంత తక్కువగా ఆలోచిస్తున్నామా? అని! ఇదే సమయంలో ఎంఐటీ రిసెర్చర్స్ మరో ఎక్స్‌పెరిమెంట్ చేశారు. ఈసారి టాపిక్… ఫేక్ న్యూస్. రెండో ఎక్స్‌పెరిమెంట్ — ఏఐతో ఫేక్ న్యూస్ పట్టుకోవచ్చా? ఈ రిసెర్చ్ లో 67 మంది పార్టిసిపెంట్స్ ను నాలుగు వారాల పాటు ఆబ్జర్వ్ చేశారు. వాళ్లకు న్యూస్ హెడ్‌లైన్స్, ఇమేజెస్ చూపించారు. క్వశ్చన్ సింపుల్. ఇది రియల్ న్యూసా? ఫేక్ న్యూసా?
కొన్ని సందర్భాల్లో ఏఐ చాట్‌బాట్ ఉపయోగించడానికి అనుమతించారు. కొన్ని సందర్భాల్లో పార్టిసిపెంట్సే స్వయంగా డెసిషన్ తీసుకోవాలి. మొదట్లో… ఏఐ నిజంగానే చాలా హెల్ప్ చేసింది. ఏఐ అసిస్టెన్స్ ఉన్నప్పుడు పార్టిసిపెంట్స్ ఫేక్ న్యూస్ ను ఐడెంటిఫై చేయడంలో 21 పర్సెంట్ ఎక్కువ యాక్యురేట్ గా ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే… ఏఐ ఎప్పుడూ చెడ్డదే అని ఈ రిసెర్చ్ చెప్పడం లేదు. సరిగ్గా ఉపయోగిస్తే ఏఐ మన పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయగలదు. ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ప్యాటర్న్ ను గుర్తించగలదు. మన అసంప్షన్స్‌ని ఛాలెంజ్ చేయగలదు. యాక్యురసీ పెంచగలదు. మరి ప్రాబ్లమ్ ఎక్కడ వచ్చింది? ఏఐని తీసేసినప్పుడు. ఏఐని తీసేస్తే… మనం ఎలా పెర్ఫార్మ్ చేస్తాం? ఫోర్ వీక్స్ తర్వాత పార్టిసిపెంట్స్ కి … ఏఐ లేకుండా కొత్త న్యూస్ ఐటమ్స్ ఇచ్చారు. అప్పుడు రిసెర్చర్స్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం గమనించారు. వాళ్ల ఇండిపెండెంట్ ఎబిలిటీ టు డిటెక్ట్ మిస్‌ఇన్ఫర్మేషన్… స్టడీ ప్రారంభంలో ఉన్న పెర్ఫార్మెన్స్ తో పోలిస్తే 15 పర్సెంటేజ్ పాయింట్స్ తగ్గింది. అంటే… ఏఐ ఉన్నప్పుడు… పెర్ఫార్మెన్స్స్ బెటర్. ఏఐ తీసేసినప్పుడు… ఇండిపెండెంట్ పెర్ఫార్మెన్స్స్ వీకర్. దీన్నే రిసెర్చర్స్ “ఏఐ డిపెండెన్సీ ప్యారడాక్స్”గా డిస్కస్ చేస్తున్నారు.
ఇది చాలా ఇంపార్టెంట్ ఐడియా. ఎందుకంటే… ప్రాబ్లమ్ ఏఐ తప్పు ఆన్సర్స్ ఇవ్వడమే కాకపోవచ్చు. ప్రాబ్లమ్ ఏఐ లేకుండా ఆన్సర్ కనుక్కునే ఎబిలిటీని మనం క్రమంగా కోల్పోవడం. ఐదుగురిలో ఒకరికి డిపెండెన్సీ పెరిగింది రిసెర్చర్స్ మరో ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ను కూడా గుర్తించారు. పార్టిసిపెంట్స్ లో ఐదో వంతు వారిలో “డిపెండెన్సీ డెవలపర్” ప్యాటర్న్ కనిపించింది. అంటే… మొదట వాళ్లు ఇన్ఫర్మేషన్ ని స్వయంగా ఇన్వెస్టిగేట్ చేసేవారు. కానీ కాలం గడిచేకొద్దీ… ఏఐ గైడెన్స్ ని ఎక్కువగా యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడే అసలు వార్నింగ్ ఉంది. మనకు ఏఐ లేకుండా ఆలోచించే అలవాటు తగ్గిపోవచ్చు! జీపీఎస్ ను తీసుకోండి. జీపీఎస్ చాలా యూజ్‌ఫుల్. కానీ ప్రతి చిన్న జర్నీకి జీపీఎస్నే ఉపయోగిస్తే… మన చుట్టూ ఉన్న రోడ్స్, డైరెక్షన్స్ని మనమే ఆబ్జర్వ్ చేయడం తగ్గిపోవచ్చు. జీపీఎస్ టెక్నాలజీ మీ బ్రెయిన్ని డ్యామేజ్ చేయలేదు. మీరు ఒక పర్టిక్యులర్ స్కిల్ని ప్రాక్టీస్ చేయడం తగ్గించారు. ఏఐ విషయంలో కూడా ఇదే ప్రిన్సిపల్ అప్లై కావచ్చు. టెక్నాలజీ మన థింకింగ్ ను మార్చడం ఇదే మొదటిసారి కాదు ఇక్కడ స్టోరీ మరింత పెద్దదవుతుంది.
ఎందుకంటే… మనిషి ఎప్పటినుంచో తన మెంటల్ టాస్క్ లోకి కొంత భాగాన్ని టెక్నాలజీకి అప్పగిస్తూనే ఉన్నాడు. క్యాల్క్యులేటర్ వచ్చింది – మాన్యువల్ కాల్క్యులేషన్స్ తగ్గిపోయాయి. సెర్చ్ ఇంజిన్స్ వచ్చాయి – ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తగ్గింది. జీపీఎస్ వచ్చింది – రూట్స్ గుర్తుపెట్టుకోవడం తగ్గింది. ఇప్పుడు ఏఐ వచ్చింది. రైటింగ్… సమ్మరైజింగ్… ట్రాన్స్‌లేషన్… రిసెర్చ్… అనాలిసిస్… కోడింగ్… ప్లానింగ్… ఇలా ఎన్నో పనులు ఏఐ చేయగలదు. ప్రతి కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఒకే ప్రశ్న. మనిషి తక్కువ తెలివైనవాడవుతాడా? కానీ హిస్టరీ ఒక కాంప్లికేటెడ్ ఆన్సర్ ఇస్తుంది. టెక్నాలజీ కొన్ని స్కిల్స్ ను మన నుంచి తీసుకుంది. అదే సమయంలో… కొత్త కెపాబిలిటీస్ కూడా ఇచ్చింది. క్యాల్క్యులేటర్ మన మ్యాథ్ ని నాశనం చేసిందా? క్యాల్క్యులేటర్ వచ్చినప్పుడు… ఇలాంటి భయాలే వచ్చాయి. ఇక పిల్లలకు కాల్క్యులేషన్స్ రావు. మ్యాథ్ స్కిల్స్ తగ్గిపోతాయి. కానీ… క్యాల్క్యులేటర్ వల్ల మ్యాథమెటిక్స్ అంతరించిపోలేదు. టెక్నాలజీ మనం చేసే పనిని మార్చింది. రిపిటిటివ్ కాల్క్యులేషన్స్‌కి గంటల సమయం కేటాయించకుండా… మనం కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ పై ఎక్కువ ఫోకస్ చేయగలిగాం. కంప్యూటర్ విషయంలోనూ ఇదే జరిగింది. ఇంటర్నెట్ విషయంలోనూ ఇదే. అందుకే ఏఐ గురించి కూడా అసలు ప్రశ్న… “ఏఐ మన ఇంటెలిజెన్స్ని తగ్గిస్తుందా?” అని కాకపోవచ్చు. అసలు ప్రశ్న… “ఏ మెంటల్ స్కిల్స్ ని మనం ఏఐకి అవుట్‌సోర్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం?” అనేది. ఎందుకంటే అన్ని స్కిల్స్ ఒకటే కాదు. ఏఐతో మల్టిప్లికేషన్ చేయించుకోవచ్చు! ఏఐతో స్కూల్ ఎస్సే మొత్తం రాయించుకోవచ్చు! ఏఐతో న్యూస్ స్టోరీ రాయించుకోవచ్చు! ఏఐతో జీవితంలో ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడం…
పూర్తిగా మరో లెవెల్. అసలు సమస్య — కాగ్నిటివ్ ఆఫ్‌లోడింగ్ సైంటిస్ట్స్ దీనికి ఒక టర్మ్ ఉపయోగిస్తారు. కాగ్నిటివ్ ఆఫ్‌లోడింగ్. సింపుల్‌గా చెప్పాలంటే… మన బ్రెయిన్ చేయాల్సిన మెంటల్ టాస్క్ లో కొంత భాగాన్ని… మన బయట ఉన్న టూల్ కి అప్పగించడం. ఫోన్ నంబర్ గుర్తుపెట్టుకోకుండా నోట్ చేసుకోవడం. క్యాల్క్యులేటర్లో కాల్క్యులేషన్ చేయడం. జీపీఎస్లో రూట్ చూడటం. ఇవన్నీ కాగ్నిటివ్ ఆఫ్‌లోడింగ్ లో భాగమే. ఈ పని ఖచ్చితంగా తప్పు అని చెప్పలేం. చాలాసార్లు ఎక్స్‌టర్నల్ టూల్స్ మన పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తాయి. కానీ… ఒక స్కిల్ ని పూర్తిగా అవుట్‌సోర్స్ చేసి… చివరికి ఆ స్కిల్ ని మనమే పెర్ఫార్మ్ చేయలేకపోతే? అక్కడే అసలు ప్రాబ్లమ్ మొదలవుతుంది. ఏఐ వాడకం ఇప్పుడు మనల్ని ఇదే క్వశ్చన్ అడుగుతోంది. మరి ఏఐ వాడటం ఆపేయాలా? బహుశా అవసరం లేదు. ఎంఐటీ రిసెర్చ్ కూడా అలా చెప్పడం లేదు. అసలు రెండో స్టడీలోనే… ఏఐ సరిగ్గా ఉపయోగిస్తే ఫేక్ న్యూస్ డిటెక్షన్ పెర్ఫార్మెన్స్ సిగ్నిఫికెంట్‌గా ఇంప్రూవ్ అవడం కనిపించింది. అసలు ఇష్యూ… ఏఐని ఎలా ఉపయోగిస్తున్నాం?! ఒకటి… నా ఎస్సే మొత్తం రాసివ్వు. మరొకటి… ఇది నా ఎస్సే. ఇందులో నా ఆర్గ్యుమెంట్ లో వీక్‌నెసెస్ ఏంటి చెప్పు. రెండింటి మధ్య చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది.
ఒకటి ఆన్సర్ ఇస్తుంది. మరొకటి… మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. అలాగే… “ఈ న్యూస్ ఫేకా, రియలా చెప్పు.” అని ఏఐని అడగడం ఒకటి. “ఈ న్యూస్ ఫేకా, రియలా తెలుసుకోవడానికి నేను ఏ క్వశ్చన్స్ అడగాలి?” అని అడగడం మరోటి. ఒక అప్రోచ్ లో ఏఐ మీకు ఆన్సర్ ఇస్తుంది. మరో అప్రోచ్లో… మీరు స్వయంగా ఆన్సర్ కనుక్కోవాలి. ఏఐ — కోపైలటా? సబ్‌స్టిట్యూటా? ఇద్దరు స్టూడెంట్స్ని ఊహించండి. స్టూడెంట్ ఏ… అసైన్‌మెంట్ మొత్తం ఏఐకి ఇచ్చాడు. ఏఐ రాసింది. కాపీ చేశాడు. సబ్మిట్ చేశాడు. టాస్క్ కంప్లీట్. కానీ… స్టూడెంట్ ఏం నేర్చుకున్నాడు? ఇక స్టూడెంట్ బీ… ముందుగా డ్రాఫ్ట్ రాశాడు. తర్వాత ఏఐని అడిగాడు… నా ఆర్గ్యుమెంట్ లో వీక్‌నెసెస్ ఏంటి?” తర్వాత… “దీనికి స్ట్రాంగెస్ట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటి?” తర్వాత… నేను ఏం మిస్ అవుతున్నాను?” ఇక్కడ ఏఐ స్టూడెంట్ తరపున ఆలోచించడం లేదు. స్టూడెంట్ థింకింగ్ ని ఛాలెంజ్ చేస్తోంది. ఇదే చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్. ఎంఐటీ రిసెర్చర్స్ కూడా ఏఐ సిస్టమ్ యూజర్ కి డైరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వడం కంటే…
Also Read : పాకిస్థాన్‌లో పవర్ లాక్‌డౌన్.. రాత్రి తొమ్మిది దాటితే చీకటే..
క్వశ్చన్స్ అడిగే సోక్రాటిక్ అప్రోచ్ ఆఫ్ ఇండిపెండెంట్ రీజనింగ్ కు ఎక్కువగా సపోర్ట్ చేయగలదని భావిస్తున్నారు. మరి ఏఐ మనల్ని డంబ్ గా మారుస్తోందా? సైంటిఫిక్ ఆన్సర్… ప్రస్తుతం మనకు తెలియదు. ఈ స్టడీస్ ఆధారంగా ఏఐ మన బ్రెయిన్ని పర్మనెంట్ గా డ్యామేజ్ చేస్తోందని చెప్పలేం. కానీ… ఏఐని మనం ఎలా ఉపయోగిస్తున్నామన్న పద్ధతి కాగ్నిటివ్ ఎంగేజ్‌మెంట్, మెమరీ, లెర్నింగ్, ఇండిపెండెంట్ పెర్ఫార్మెన్స్ మీద ప్రభావం చూపవచ్చని రిసెర్చ్ సిగ్నల్స్ చూపిస్తున్నాయి. అందుకే ఈ డిబేట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్… హ్యూమన్స్ వర్సెస్ ఏఐ కాదు. ఏఐ ఇప్పటికే మనతో ఉంది. అసలు ప్రశ్న… ఏఐని ఉపయోగిస్తూ మనం ఎలాంటి హ్యూమన్స్ గా మారబోతున్నాం అసలు డేంజర్ ఏఐ కాదు బహుశా ఏఐ చాలా ఇంటెలిజెంట్ అవ్వడమే బిగ్గెస్ట్ డేంజర్ కాకపోవచ్చు. అసలు డేంజర్ ఏంటంటే… ఏఐ మన కోసం ఆలోచించడం మనకు చాలా కంఫర్టబుల్ అయిపోవడం. ఏఐ ప్రతిదీ రాస్తే – మన రైటింగ్ స్కిల్ తగ్గొచ్చు. ఏఐ ప్రతిదీ రిసెర్చ్ చేస్తే – మన రిసెర్చ్ ఎబిలిటీ తగ్గొచ్చు. ఏఐ ప్రతిదీ వెరిఫై చేస్తే – మన క్వశ్చనింగ్ తగ్గొచ్చు. ఏఐ ప్రతి డెసిషన్ తీసుకుంటే – మన జడ్జ్‌మెంట్ కూడా బలహీనపడొచ్చు. అప్పుడు టెక్నాలజీ…
ఒక టూల్ నుంచి సబ్‌స్టిట్యూట్ గా మారుతుంది. చివరగా.. ఏఐ మన బ్రెయిన్ ని డిస్ట్రాయ్ చేస్తుందా? ఇప్పటి ఎవిడెన్స్ ప్రకారం… అలా చెప్పలేం. కానీ… ఏఐ డిఫికల్ట్ టాస్క్స్ విషయంలో మన బ్రెయిన్ ఎలా ఎంగేజ్ అవుతుందో మార్చగలదా? అవును దానికి రిసెర్చ్ ఎవిడెన్స్ కనిపిస్తోంది. అందుకే రెస్పాన్సిబిలిటీ మనదే. ఏఐ వాడటం ఆపేయాల్సిన అవసరం లేదు. కానీ ఏఐని వాడే విధానం మార్చుకోవాలి. ముందు మనమే ఆలోచించాలి. తర్వాత ఏఐని అడగాలి. ఆన్సర్ ని ఛాలెంజ్ చేయాలి. ఇన్ఫర్మేషన్ ను వెరిఫై చేయాలి. మరి కొన్ని సార్లు… ఏఐని ఆఫ్ చేసి అదే పని మనమే చేయాలి. ఎందుకంటే… మసిల్‌ని ఎక్సర్సైజ్ చేయకపోతే ఎలా వీక్ అవుతుందో… థింకింగ్ ఎబిలిటీ కూడా ప్రాక్టీస్ తోనే స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి… ఏఐ ఎక్కువగా వాడేవాళ్లే ఫ్యూచర్ లో సక్సెస్‌ఫుల్ అవుతారని కాదు. ఏఐని ఎప్పుడు ఉపయోగించాలో, ఎప్పుడు ఏఐని పక్కన పెట్టి స్వయంగా ఆలోచించాలో తెలిసిన వాళ్లకే ఫ్యూచర్ లో అడ్వాంటేజ్ ఉంటుంది. ఏఐ మన బ్రెయిన్ కి రీప్లేస్‌మెంట్ కాకూడదు. మన బ్రెయిన్ కు స్పారింగ్ పార్ట్నర్ కావాలి. అదే బహుశా… ఏఐతో మనిషి కలిసి మరింత బెటర్ గా ఆలోచించే ఫ్యూచర్ అవుతుంది.









