ఫిలిప్పీన్స్‌(Philippines) లో చిన్నారులపై జరుగుతున్న దారుణాలు, ఆన్‌లైన్ వేధింపుల వెనుక అమెరికా లాంటి పెద్ద దేశాలకు చెందిన కామాంధుల కుట్ర బట్టబయలైంది. డాలర్ల కోసం కన్నవారే తమ పిల్లల జీవితాలను బలిపెడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఫిలిప్పీన్స్‌లో దాదాపు ఐదు లక్షల మంది పిల్లలను డబ్బులిచ్చే విదేశీ కస్టమర్ల కోసం లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : రష్యా-పాక్ సరికొత్త డ్రామా.. ఇస్లామాబాద్‌లో దిగిన పుతిన్ రైట్ హ్యాండ్.. భారత్‌కు ముప్పు తప్పదా?

ముఖ్యంగా అమెరికా దేశానికి చెందిన కొనుగోలుదారులు ఇలాంటి అసభ్యకరమైన వీడియోల కోసం ఏళ్ల తరబడి కోట్లలో డబ్బులు పంపుతున్నారు. ఆగ్నేయాసియాలో ఉన్న ఈ చిన్న దేశం ఇప్పుడు ఇంటర్నెట్ వేదికగా సాగే బాలల లైంగిక దోపిడీకి పెద్ద అడ్డాగా మారిపోయింది. ప్రతి వంద మంది పిల్లల్లో ఒకరు ఈ చీకటి ప్రపంచంలోకి నెట్టబడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.

అయితే విదేశాల నుంచి డబ్బులు పంపేవారికి కన్న తల్లులు, కుటుంబ సభ్యులే స్వయంగా తమ పిల్లలను వారికి బలి ఇస్తున్నారు. ఇంట్లో ఉన్న పేదరికం కారణంగా కొందరు డబ్బులకు ఆశపడి పసిపిల్లలను ఈ నరకంలోకి నెట్టేస్తున్నారు. ఆన్‌లైన్ లైవ్‌స్ట్రీమ్‌లు, మెసేజింగ్ యాప్ గ్రూపుల ద్వారా విదేశీయులకు ఈ వీడియోలను అమ్ముకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు. గత ఏడాది ఈ నేరానికి సంబంధించి అరెస్టయిన వాళ్లలో ఎక్కువ మంది బాధితుల తల్లులే ఉన్నారు.

ఈ దుర్మార్గపు ఉచ్చులో ఎందరో పసిపిల్లలు చిక్కుకున్నారు. కనీసం ఐదేళ్లు కూడా లేని చిన్నారులను బలవంతంగా ఇందులోకి లాగుతున్నారు. కేట్, ఐసా లాంటి ఎంతోమంది చిన్నారులు తమ సొంత వాళ్ల చేతుల్లోనే మోసపోయారు. విదేశాల్లో ఎక్కడో ఉన్నవాళ్లు డబ్బులు ఇస్తున్నారనే దురాశతో పసిపిల్లల అని కూడా చూడకుండా వారిని మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు. రాత్రి సమయాల్లో నిద్రలేపి మరీ ఈ అరాచకాలకు పాల్పడుతున్నారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా చట్టాలు, రూల్స్ ఎంత కఠినంగా ఉన్నప్పటికీ టెలిగ్రామ్ లాంటి ప్రైవేట్ యాప్‌ల ద్వారా ఈ వ్యవహారం ఇంకా రహస్యంగా సాగుతూనే ఉంది. కేవలం కొన్ని క్లిక్‌లతో డబ్బులు చెల్లించి ఈ వీడియోలను చూస్తున్న విదేశీ మృగాల అంతు చూడాలని, కన్న పిల్లలనే అమ్ముకుంటున్న వాళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.

Also Read : హౌతీల దాడులు.. బంకర్‌లో సౌదీ యువరాజు!