Road Accident :  అమెరికాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు మహిళ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్ మండలం అకుతోటపల్లికి చెందిన శ్రీపాటి దీపారెడ్డి (44) అనే మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

Also Read : జపాన్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు!

వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల్ మండలానికి చెందిన పట్టాభి శేఖర్ రెడ్డి, శశిరేఖ దంపతుల కుమార్తె అయిన దీపారెడ్డికి, ఆమన్‌గల్ మండలం అకుతోటపల్లికి చెందిన రామకృష్ణారెడ్డితో దాదాపు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్‌వేర్ నిపుణులు కావడంతో కొద్దికాలం క్రితం అమెరికాలో స్థిరపడ్డారు.

సోమవారం నాడు న్యూజెర్సీలో దీపారెడ్డి ప్రయాణిస్తున్న కారును ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మరో కారు వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాలులయ్యాయి. పరిస్థితి విషమించడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విదేశాల్లో స్థిరపడిన తెలుగు మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆమె స్వగ్రామంలో మరియు కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also Read : ట్రంప్‌కు ఇరాన్ మైండ్ బ్లాక్ స్కెచ్.. ఆ 3 షరతులు ఒప్పుకుంటేనే చర్చలు!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.