
China : ప్రకృతి ఎంత ప్రమాదకరంగా మారుతుందో నేపాల్‌లో వచ్చిన వరదలే నిదర్శనం. నేపాల్, టిబెట్ సరిహద్దులోని గిరాంగ్ పోర్ట్ వద్ద ఈ పెను విపత్తు సంభవించింది. పెద్ద పెద్ద బండరాళ్లు, దట్టమైన బురద, భారీ నీటి ప్రవాహం ఆ ప్రాంతాన్ని ముంచెత్తాయి. ఆ ఉప్పెనలో అక్కడి వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీసిన జనం ఆ ప్రవాహంలో చిక్కుకుని కన్నుమూశారు. కొండల మధ్య వచ్చిన ఈ వరద భయానక సృష్టిని అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు రికార్డు చేశాయి.
Also Read : కీవ్‌పై రష్యా దాడి.. 27 మంది మృతి!
ఈ భయంకరమైన వీడియోను ప్రపంచ దేశాలన్నీ చూసి కలవరపడ్డాయి. కానీ చైనాలో మాత్రం ఈ వీడియో కనిపించకుండా కఠినమైన ఆంక్షలు పెట్టారు. ఇప్పటివరకు ఆ దేశంలో ఎక్కడా ఆ పూర్తి వీడియోను చూపించలేదు. కేవలం ఒకే ఒక ఫోటోను మాత్రమే చైనా మీడియాలో పదే పదే ప్రసారం చేస్తున్నారు. కఠినమైన నిబంధనలు ఉన్న చైనా ఇంటర్నెట్లో ఈ విపత్తుకు సంబంధించిన ఏ వీడియో కూడా రాకుండా అడ్డుకున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పోస్టులన్నింటినీ వెంటనే తొలగించారు.
వరదలు వచ్చిన వెంటనే చైనా ప్రభుత్వం సహాయక చర్యలు మొదలుపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విపత్తు తర్వాత ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రత్యేకంగా స్పందించారు. చైనా వైపు కూడా చాలా నష్టం జరిగిందని సమాచారం ఉన్నా, బయటి ప్రపంచానికి మాత్రం ఎలాంటి నిజాలు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. గత కొన్ని రోజులుగా ప్రపంచమంతా నేపాల్ వరదలను చూస్తుంటే, చైనాలో మాత్రం ఆ వీడియోలు ఎవరికీ కనపడకుండా అడ్డుగోడలు కట్టారు.
ఈ విపత్తుపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నేపాల్‌తో మాట్లాడారు. నేపాల్ అధ్యక్షుడు రాంచంద్ర పౌడల్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రెండు దేశాల ప్రజలు కలిసికట్టుగా ఈ కష్టాన్ని అధిగమిస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. బాధితులు త్వరలోనే తమ ఇళ్లను మళ్లీ నిర్మించుకుంటారని ఆశాభావం తెలిపారు.
Also Read : ఉక్రెయిన్ పై విరుచుకుపడ్డ రష్యా.. డ్రోన్ల దాడితో విధ్వంసం









