MLA Shocking Video: ప్లీజ్.. ప్లీజ్ ఒక్కసారి.. నడిరోడ్డుపై MLAపై చేయి వేసి..!

కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. 71 ఏళ్ల సీనియర్ కాంగ్రెస్ నేత చెరియన్ ఫిలిప్..  కొల్లాం నియోజకవర్గం నుంచి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే బిందు కృష్ణను పబ్లిక్‌గా కౌగిలించుకునేందుకు యత్నించడం వివాదాస్పదమైంది. తిరువనంతపురంలోని పార్టీ ఆఫీసుకు వచ్చిన బిందు కృష్ణకు పార్టీ శ్రేణులు స్వాగతం పలుకుతున్న సమయంలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. ఆమె అందరికీ నమస్కరిస్తూ ముందుకు సాగుతుండగా.. ఆమె ముందుకు వచ్చిన చెరియన్ ఫిలిప్ ఆమెను కౌగిలించుకునేందుకు యత్నించాడు. 

Also Read: సెల్ఫ్ ఎన్యుమరేషన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన తెలంగాణ డీజీపీ!

Also Read: మోదీ, అమిత్ షాలకు దిమ్మతిరిగే షాక్.. NDAకు AIADMK వెన్నుపోటు!

బిందు కృష్ణ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాచినప్పటికీ.. చెరియన్ ఫిలిప్ ఆమెను హగ్ చేసేందుకు యత్నించాడు. ఆమెకు అతడిని ఆలింగనం చేసుకునేందుకు ఇష్టం వ్యక్తం చేయనప్పటికీ అతడు మళ్లీ కౌగిలించుకునేందుకు యత్నించాడు. అయినప్పటికీ ఆమె అతడ్ని పక్కకు నెట్టి ముందుకు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. కాంగ్రెస్ నేత చెరియన్ ఫిలిప్ ప్రవర్తించిన తీరుపై నెటినజ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని వెంటనే పార్టీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.   

Also Read: ‘సిటాడెల్ 2’ నుంచి ‘డెకాయిట్‌’ వరకు.. వీకెండ్‌కి అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్!

అయితే ఫిలిప్‌కు ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో 2015లో కూడా కాంగ్రెస్ మహిళా నేతలు టిక్కెట్లు పొందడం గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజా ఉదంతం నేపథ్యంలో మహిళా భద్రత, కార్యాలయాల్లో మహిళా ప్రజాప్రతినిధులకు దక్కాల్సిన కనీస గౌరవంపై కేరళలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.