Mamata Banerjee: బీజేపీకి బిగ్ షాక్.. లాయర్ అవతారం ఎత్తిన మాజీ సీఎం.. బెంగాల్ లో హైటెన్షన్!

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత  ఆ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, మాజీ సీఎం మమతా బెనర్జీ లాయర్ అవతారం ఎత్తారు. తన పార్టీ కార్యకర్తలు,  పార్టీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో బెనర్జీ స్వయంగా న్యాయవాదిగా వాదనలు వినిపించనున్నారు. ఒక లాయర్‌గా నేను ఈ కేసును పోరాడుతున్నానని ఆమె ధర్మాసనానికి స్పష్టం చేశారు.  

ఆమె కేసు విచారణకు సంబంధించిన పలు అంశాలపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది. కోల్‌కతా, ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయన్న నివేదికల నేపథ్యంలో, చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ పిటిషన్లపై విచారణ జరుపుతోంది.

Also Read: పశ్చిమాసియా సంక్షోభం..పొదుపు మంత్రం జపిస్తున్న ప్రపంచం..ఏం చేస్తున్నాయో తెలుసా?

207 సీట్లను గెలుచుకుని

కాగా మే 4న విడుదలైన ఫలితాల్లో బిజెపి 294 స్థానాలకు గాను 207 సీట్లను గెలుచుకుని ఘనవిజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. దీనితో 15 ఏళ్ల తృణమూల్ పాలన ముగిసింది. ఆ ఎన్నికల్లో TMC  కేవలం 80 సీట్లకే పరిమితమైంది. మే 9న సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read: ఢిల్లీలో మరో ‘నిర్భయ’ ఘటన….కదులుతున్న బస్సులో లైంగికదాడి