Fire Accident in Pakistan : ఆసుపత్రులలో తరుచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలు కలకర పెడుతున్నాయి. రాజాగా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఓ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 15 మంది నవజాత శిశువులు సజీవదహనం కావడం తీవ్ర విషాదాన్ని నింపింది.పాక్‌లోని ‘పాకిస్థాన్ ఇన్‌పేషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (PIMS) ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 మంది నవజాత శిశువులు సజీవదహనమైనట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలోని గైనకాలజీ వార్డులో ఉన్న నర్సరీలో ఈరోజు (బుధవారం) ఉదయం ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఆసుపత్రిలోని గైనకాలజీ విభాగంలో ఉన్న ఏసీ కంప్రెసర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో ప్రత్యేక వార్డులో మొత్తం 16 మంది నవజాత శిశువులు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో కేవలం ఒక్క శిశువును మాత్రమే ఆసుపత్రి వర్గాలు రక్షించగలిగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర స్థాయిలో శ్రమించి మంటలను ఆర్పి, సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాల వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా, కన్నబిడ్డలను పోగొట్టుకున్న పలువురు మహిళలు తమ కడుపుకోతను బరించలేక విలపిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.