
Nepal Floods : నేపాల్లో ఆకస్మిక వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. వరద దాటికి పెద్ద పెద్ద ఇండ్లు సైతం నేలమట్టం అయ్యాయి. అనేక నిర్మాణాలు పునాదులతో సహా కొట్టుకుపోయాయి. కానీ, ఇంటి చుట్టూ భయంకరమైన జలప్రళయం విధ్వంసాన్ని సృష్టిస్తున్నా ఓ కుటుంబం మాత్రం ఏ మాత్రం జడుసుకోకుండా అదే ఇంట్లో ఉన్నారు. ఇంటి చుట్టు నీరు చేరుతున్న దృశ్యాలను చూస్తూ ఇంటిలోనే ఉన్నారు. అంతేకాదు అంతటి వరద సైతం ఆ ఇంటిని ఏం చేయలేకపోయింది. దీంతో ఆ ఇంట్లో ఉన్న కుటుంబం సురక్షితంగా బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారాయి.
ఓవైపు వరద ఉధృతికి చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, భవనాలు, శిథిలాలు కొట్టుకుపోయినప్పటికీ.. ఆ ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా బలంగా నిలిచింది. ఇంటి చుట్టూ ఉన్న చిన్న చిన్న నిర్మాణాలు దెబ్బతిన్నప్పటికీ ఆ ఇంటికి మాత్రం ఏం కాలేదు. ఇంట్లో ఉన్నవారు కూడా మాకు ఏం కాదు అన్నంత ధీమాగా కనిపించారు. అంతటి వరదలోనూ ఇంట్లో ఉన్న కుటుంబం ప్రాణాలతో బయటపడిన విషయం ఇపుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Also Read : విశాఖలో దారుణం..భార్య పిల్లలకు విషమిచ్చి… తాను ఉరివేసుకుని..
That family in the green house. I hope they are alive and safe. 🙏🏻 what a nightmare. pic.twitter.com/t2tVR2cFD7
— Pooja Shali (@PoojaShali) August 28, 2026
వైరల్ అవుతున్నఈ వీడియోలో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు తమ ఇంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. వారి ఇంటి చుట్టూ వరద నీరు భయంకరంగా వేగంగా ప్రవహిస్తూ ఒక్కసారిగా దూకింది. బురదతో నిండిన వరద ప్రవాహం వేగంగా దూసుకు వచ్చి ఆ ఇంటిని చుట్టుముట్టింది. నీటి మార్గంలో ఉన్న పలు నిర్మాణాలు, అడ్డు వచ్చిన చెట్లు, ఇతర నిర్మణాలు పూర్తిగా వరద దాటికి కొట్టుకుపోయాయి. అయితే వరద ప్రవాహం ఇంటికి అత్యంత సమీపంగా వచ్చినప్పటికీ.. ఆ కుటుంబం మాత్రం ఏమాత్రం బయపడకుండా సురక్షితంగా బయటపడింది. అంతేకాదు, చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ఆ ఇల్లు మాత్రం పెద్దగా నష్టం లేకుండా నిలబడటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అందరూ కూడా ఆ ఇంటిని కట్టిందేవరో కానీ వారిక దండం పెట్టాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
Also Read : చెప్పాల్సిదంతా నిన్ననే చెప్పా..కొత్తగా చెప్పాల్సిందేం లేదు..కొండా సురేఖ









