
YCP : మాజీ రాజ్యసభ నేత విజయసాయిరెడ్డి సంచలన బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. త్వరలోనే కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నానని ఆయన ఆ లేఖలో ప్రకటించారు. పార్టీలోని కొద్దిమంది వ్యక్తులతో కూడిన కోటరీ తనపై సోషల్ మీడియాలో కావాలనే దుష్ప్రచారం చేస్తోందని విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తనను నమ్మకద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ కి తాను ఎప్పుడూ నమ్మకస్తుడిగానే ఉన్నానని, ఒకవేళ నమ్మకద్రోహం చేయాలనే ఆలోచన తన రక్తంలో ఉంటే ఎప్పుడో పార్టీ మారిపోయేవాడినని ఆయన స్పష్టం చేశారు. జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగాననే కారణంతోనే తనపై అనేక అక్రమ కేసులు బనాయించారని, సీబీఐ, ఈడీ కేసుల్లో నిందితుడిగా చేర్చారని ఆయన గుర్తుచేశారు.
Also Read : కొడుకును ఒంటరిగా వదిలి.. గోదావరిలోకి దూకిన దంపతులు
విజయసాయి రెడ్డి బహిరంగ లేఖ…@TV9Telugu @NtvTeluguLive @tv5telugu @SakshiNews @etvandhraprades @abntelugutv @MahaaOfficial @RajnewsOfficial @TNewsTelugu @ANI @PTI_News @timesofindia @htTweets @eenadulivenews @ANDHRAJYOTI @SakshiNews @the_hindu @IndianExpress @NewIndianXpress… pic.twitter.com/J8WQhm4QuN
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 29, 2026
Also Read : ఆ ఇళ్లు కట్టినోళ్లకు దండం పెట్టాలి… నేపాల్ వరదల్లో షాకింగ్ దృశ్యం
2020 సంవత్సరం తర్వాత నుంచి పార్టీలో తనపై పద్ధతి ప్రకారం కుట్రలు జరిగాయని, అవమానాలు ఎదురయ్యాయని విజయసాయిరెడ్డి ఆరోపించారు. తనకు అప్పగించిన ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించడంతో పాటు, కీలకమైన కోర్ కమిటీ నుంచి కూడా తనను తొలగించారని తెలిపారు. నేను ఎప్పుడూ ఏ కోటరీలోనూ భాగం కాలేదు. కానీ జగన్‌గారి దృష్టిలో నా మాటకూ, సలహాలకూ ఉన్న విలువను 2020 నుంచి అంచెలంచెలుగా తగ్గించింది ఎవరో పార్టీ శ్రేణులు ఆలోచించాలి అని ఆయన ప్రశ్నించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక రాజ్యాంగేతర శక్తిగా చక్రం తిప్పారని విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనీసం మంత్రులకు కూడా జగన్ అపాయింట్‌మెంట్ దొరకకుండా సజ్జల అడ్డుకున్నారని ఆరోపించారు. పార్టీలోని సీనియర్ నాయకులు, కష్టపడి పనిచేసే కార్యకర్తలు సైతం సజ్జల చెప్పినట్లే నడుచుకోవాల్సిన దయనీయ పరిస్థితి పార్టీలో ఏర్పడిందని ఆయన ఆరోపించారు. దీనిపై వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు తీవ్రంగా ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయసాయిరెడ్డి రాసిన ఈ బహిరంగ లేఖ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.









