
ప్రపంచ ప్రసిద్ధ జర్మనీ కార్ల తయారీ దిగ్గజం ‘ఫోక్స్‌వ్యాగన్'(Volkswagen) తమ ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి ఏకంగా లక్ష మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ ప్రణాళికలు రెడీ చేసింది. కంపెనీ యాజమాన్యానికి, అక్కడ పనిచేసే కార్మిక సంఘాలకు మధ్య జరిగిన చర్చల తర్వాత భారీగా కంపెనీలో లేఆఫ్స్ చేయనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే మొదట కేవలం 50 వేల మందిని మాత్రమే తొలగించాలని కంపెనీ భావించింది. కానీ ఆ తర్వాత కంపెనీ ఆర్థిక పరిస్థితులు క్షీణించడంతో అదనంగా మరో 50 వేల మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ నిర్ణయించింది.
Also Read : నేపాల్ కన్నీటి కథలు.. మృతదేహాలు లేకున్నా అంత్యక్రియలు.. ఎలా చేస్తున్నారంటే?
German car giant Volkswagen will cut 100,000 jobs by the end of the decade in the biggest restructuring in global auto industry history.
Four German plants face an uncertain future as the carmaker battles US tariffs and Chinese competition.
🔴 More on https://t.co/MbrRGkFd1I pic.twitter.com/D7HZ1jgEmX
— Al Jazeera English (@AJEnglish) September 4, 2026
ప్రస్తుతం ఉన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం, మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కంపెనీలో శ్రామిక శక్తిని తగ్గించుకోవడం తప్ప వేరే మార్గం లేదని ఫోక్స్‌వ్యాగన్ యాజమాన్యం తేల్చిచెప్పింది. ఒకవేళ ఈ లేఆఫ్‌లు ప్రణాళిక ప్రకారం పూర్తయితే అంతర్జాతీయ ఆటోమొబైల్ పరిశ్రమ చరిత్రలోనే ఇది అతిపెద్ద పునర్వ్యవస్థీకరణగా నిలిచిపోతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లో దాదాపు 6.67 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ఒక్క జర్మనీలోనే 43 శాతం మంది ఉన్నారు. ఇప్పుడు తీసివేయబోయే ఈ లక్ష మంది ఉద్యోగులు కంపెనీ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఏకంగా 15 శాతానికి సమానం. మొదట్లో ఈ ఉద్యోగుల తొలగింపును కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ కంపెనీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చివరకు అంగీకరించక తప్పలేదు. అయితే భారీగా ఉద్యోగులను తొలగించడంతో పాటు జర్మనీలోని నాలుగు ప్రధాన తయారీ ప్లాంట్లను శాశ్వతంగా మూసివేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు.
Also Read : అమెరికా టూ లండన్.. 86 టన్నుల బంగారం.. ఎందుకు?
ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి విపరీతంగా పెరిగిపోయిన ఖర్చులు, ప్రపంచ మార్కెట్లో చైనా కార్ల కంపెనీల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన పోటీ, అలాగే అంతర్జాతీయ టారిఫ్‌ల భారం కంపెనీ లాభాలను దెబ్బతీశాయి. ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ కేవలం ఒక్క బ్రాండ్‌కే పరిమితం కాలేదు. ఇది ఆడి, పోర్షే, లాంబోర్గిని, బెంట్లీ వంటి లగ్జరీ కార్లతో పాటు స్కానియా, డుకాటీ వంటి ప్రముఖ కమర్షియల్, టూవీలర్ బ్రాండ్లను కూడా నడుపుతోంది. గతంలో 2009లో జనరల్ మోటార్స్ కంపెనీ దివాలా తీసిన సమయంలో 50,000 మంది ఉద్యోగులను తొలగించడం అప్పట్లో ఒక పెద్ద రికార్డు. కానీ ఇప్పుడు ఫోక్స్‌వ్యాగన్ ప్రకటించిన ఈ లక్ష మంది తొలగింపు ఆటో రంగాన్ని మరింత వణికించేలా ఉంది.









