Ee Paata Korinavaru Movie With Big Title : ఇటీవల వస్తున్న సినిమాలు కొన్ని పేర్లతో ఆకట్టుకుంటే మరికొన్ని కథతో ఆకట్టుకుంటున్నాయి. నేటి జన్‌జీ తరానికి తగ్గరగా ఉండి వారిని ఆకర్శించే కథాంశాలతో పలువురు సినిమాలు తీస్తూ రాణిస్తున్నారు. తాజాగా ఆ నలుగురు’ ఫేమ్ చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్ర కథాంశం ఎలా ఉందో కానీ, పేరుతోనే ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తెలుగు సినీ చరిత్రలోనే అతిపెద్ద టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కడం విశేషం. ఇంతకీ ఈ సినిమా పేరేంటో తెలుసా? ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’. అవును ఇదే ఆ చిత్రం టైటిల్ అంతేకాదు…‘ఎ ఫర్‌బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా’ అనేది ఉపశీర్షిక.

తెలుగు సినీ చరిత్రలో ఇదే అతి పెద్ద టైటిల్‌ అని చిత్ర దర్శకుడు చెబుతున్నారు. కాగా ఇందులో హర్ష హీరోగా అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారట. సెప్టెంబర్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకుందటుందని డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ్ అంటున్నారు. ‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’, “ఇదీ సంగతి”, ‘ఆటగదరా శివా’ తదితర విభిన్న చిత్రాలతో ఆకట్టుకుని, విలక్షణమైన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడు డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ్.

Also Read : డెలులు టీజర్‌.. ఫన్‌తో అదరగొడుతున్న యూత్ మూవీ!

ఫిల్మోత్సవ్ బ్యానర్‌పై డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ్ సొంతగా ఈ చిత్రాన్ని నిర్మించడం గమనార్హం. ప్రముఖ దర్శక రచయిత మదన్ అందించిన కథతో ఈ సినిమా రూపొందిందనట్లు ఆయన తెలిపారు. ‘ఆ నలుగురు’ చిత్రంతో మానవ సంబంధాలు, భావోద్వేగాలను తెరమీద బలంగా ఆవిష్కరించిన దర్శకుడు చంద్ర సిద్ధార్థ్, ఈసారి ఆధునిక థ్రిల్లర్ నేపథ్యంతో మరో భిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇది మొట్ట మొదటి మిస్టరీ మ్యూజికల్ జోనర్ సినిమా అని కూడా చిత్ర నిర్మాతలు అంటున్నారు.

సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని కథలో కీలకంగా మలుస్తూ ఈ చిత్రం రూపొందిందని వారు తెలిపారు. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, జ్ఞాపకాలు, అపరాధ భావన వంటి అంశాలను మిస్టరీ కథనంతో మేళవించిన చిత్రంగా వారు వివరించారు. చంద్ర సిద్ధార్థ్ మాట్లాడుతూ.. “భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్ ఇది. నా స్నేహితుడైన మదన్‌తో ఈ కథను సినిమాగా చేద్దామనుకున్నాము. ఇది మదన్ చనిపోయే ముందు చివరిగా ప్లాన్ చేసిన సినిమా” అని ఆయన వెల్లడించారు.

“నేను అప్పట్లో మదన్ కథతోనే ‘ఆ నలుగురు’ సినిమా తీశాను. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ప్రతి రోజూ రాత్రి సరిగ్గా పదిన్నర గంటలకు ఓ రేడియో స్టేషన్ నుంచి ఒకే పాట ప్రసారమవుతూ ఉంటుంది. నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు ఈ పాటను కోరుతూ ఉంటారు” అని చంద్ర సిద్ధార్థ్ కథను ఆసక్తికరంగా వివరించారు. ధ్వని, న్యూరోసైన్స్, జ్ఞాపకాలు, అపరాధ భావన, ప్రేమ వంటి అంశాలను మేళవిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించామని, ఈ హై-కాన్సెప్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందించడానికి ప్రయోగాత్మకంగా చేసిన ప్రయత్నం ఇది” అని డైరెక్టర్ తెలిపారు.

Also Read : పెళ్లైన 5 నెలలకే విడాకులు.. రాపర్ బాద్‌షా, నటి ఇషా రిఖీ సంచలన ప్రకటన

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.