Saudi Arabia Water System
Saudi Arabia Water System

నో వాటర్? నో ప్రాబ్లమ్!.. సహజ సిద్ధమైన నదులు లేవు, వర్షపాతం కేవలం 100 మి.మీ. కంటే తక్కువే, ఎండలు చూస్తే 45°C అప్. బావి తవ్వితే నీళ్లకు బదులు చమురు పడే క్రేజీ ల్యాండ్. కానీ, ఇలాంటి నో-వాటర్ జోన్‌లో 4 కోట్ల మందికి 24/7 ప్యూర్ మినరల్ వాటర్ అందుతోందంటే దట్ ఈజ్ సౌదీ అరేబియాస్(Saudi Arabia) నెక్స్ట్-లెవెల్ ఇంజనీరింగ్ ఫ్లెక్స్. మొత్తం గల్ఫ్ వైబ్‌కే గేమ్‌ఛేంజర్‌గా మారిన ఈ వాటర్ నెట్‌వర్క్ సిస్టమ్ ఎలా సెట్‌ చేశారో ఇప్పుడు చూద్దాం.

సౌదీ అరేబియా భూభాగం మొత్తం 21.5 లక్షల చదరపు కిలోమీటర్లు. అందులో 95% ఎడారి ప్రాంతమే. చచ్చినా తాగునీరు దొరకని డిజర్ట్‌. ఎంత తవ్వినా చమురు తప్ప నీటి చుక్క రాదు. పోనీ వాన చుక్క ఏమైనా వస్తుందనుకుంటే వరుణ దేవుడు భూమి పుట్టకముందే సౌదీతో కటీఫ్‌ చేసుకున్నట్లున్నాడు. ఎంత బాదుకున్నా కరుణించడం లేదు. అందుకే..దేవుడిపై భారం మోపడం కంటే మనిషి మేధస్సుతోనే సమస్య పరిష్కరించాలనుకున్నారు సౌదీ పాలకులు..

అల్టిమేట్‌ ఇంజనీరింగ్ టెక్నాలజీతో ప్రపంచమే ఔరా అనిపించేలా స్కెచ్చేశారు. అపారమైన సముద్రం నీటిని తాగునీటిగా మలచడానికి ప్లాన్‌ చేశారు. మహామహుల్లాంటి ఇంజనీర్లు బరిలోకి దిగారు. చివరకు సముద్రపు నీటిని తాగునీరుగా మార్చడంలో సౌదీ గ్లోబల్ లీడర్‌గా ఎస్టాబ్లిష్‌ అయ్యింది.

ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డీశాలినేషన్ ప్లాంట్స్‌తో కోస్టల్ వాటర్‌ను ఫిల్టర్ చేసి ప్యూర్ డ్రింకింగ్ వాటర్‌గా మారుస్తున్నారు.ఎడారి నావిగేషన్‌కు GPS, పర్వతాలను పేల్చే బ్లాస్టింగ్స్, తుప్పు పట్టని అల్ట్రాసోనిక్ కోటెడ్ కార్బన్ స్టీల్ పైప్‌లైన్స్… ఇదీ వీళ్ల ఆర్టిఫిషియల్ రివర్ కనెక్టివిటీ. అంతేకాదు, డీశాలినేట్ అయిన నీటికి క్యాల్షియం, మెగ్నీషియం, పర్ఫెక్ట్ pH లెవెల్స్ యాడ్ చేసి డైరెక్ట్ ప్రీమియం మినరల్ వాటర్‌ను పబ్లిక్‌కు ఇస్తున్నారు.

Also Read : రూ.170 కోట్ల విరాళం.. అమెరికా కాలేజీకి భారత దంపతుల పేర్లు!

ఫ్యూచర్‌లో సౌదీ వాటర్ గేమ్ కేవలం ఆయిల్ బర్నింగ్ పైనే నడవదు. సౌదీ విజన్ 2030తో మరింత గ్రీన్ & స్మార్ట్‌గా మారుతోంది.. చమురు కాల్చి నీటిని శుద్ధి చేసే ఓల్డ్‌ సిస్టమ్‌కు బై-బై చెప్పి, 100% సౌర విద్యుత్‌తో సముద్రపు నీటిని ఫిల్టర్ చేసే హైటెక్ ప్లాంట్స్ నిర్మిస్తున్నారు.

సౌదీ అరేబియా జనాభాలో అధిక శాతం ఎర్రసముద్రం, పర్షియన్ గల్ఫ్ సమీపంలోనే నివసిస్తున్నారు. 40 ట్రిలియన్ లీటర్ల చమురు నిల్వలతో అలరారుతోన్న సౌదీ అరేబియా తన ప్రజలకు మంచినీటిని అందించేందుకు సముద్ర జలాలపై ఆధారపడింది. ఉప్పునీటిని శుద్ధి చేసే డీశాలినేషన్ ప్లాంట్లను విరివిగా ఏర్పాటు చేసింది. శుద్ధి చేసిన నీటిని తీర ప్రాంతాల నుంచి ప్రజల వద్దకు చేర్చేందుకు భారీ ఎత్తున పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను నిర్మించింది. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రాంతంలో కృత్రిమ నదీ వ్యవస్థ ఏర్పాటు చేసింది.

ఒకవైపు మండే ఎండలు..మొత్తం ఇసుక ప్రాంతం.. పైగా అండర్‌గ్రౌండ్‌ ప్రెషర్‌.. మరోవైపు, ఉప్పు నీరు.. వీటిని తట్టుకొని కొన్ని దశాబ్దాల పాటు చెక్కుచెదరకుండా పటిష్టమైన పైప్‌లైన్‌ను సౌదీ అరేబియా ఏర్పాటు చేసింది. చమురు, గ్యాస్ పైప్‌లైన్‌లలో ఉపయోగించే అధిక సామర్థ్యం గల కార్బన్ స్టీల్‌తో ఈ వ్యవస్థను నిర్మించింది. ఇందుకోసం మొదట పైపులను అల్ట్రాసోనిక్‌తో పరీక్షించి.. తుప్పు పట్టకుండా పూత వేశారు. తర్వాత పెద్ద ట్రక్కుల్లో ఎక్కించి.. వందల కి.మీ.దూరంలో ఉన్న ఎడారి ప్రాంతానికి తీసుకెళ్లి అమర్చారు. ఎడారిలో ఈ పైప్‌లైన్లు ఏర్పాటు చేసేందుకు జీపీఎస్‌, అధునాతన సర్వే పరికరాలు ఉపయోగించారు. రాయితో కూడిన ప్రాంతం, పర్వతాలు అడ్డుగా ఉన్నచోట పేలుళ్లతో సొరంగాలను తవ్వారు. ఆ తర్వాత పైపుల్ని అందులోకి దించి, ఒక్కోభాగాన్ని కలుపుతూ భారీ నెట్‌వర్క్‌ నిర్మించారు.

Also Read : యాపిల్ మైండ్ బ్లాకింగ్ ధమాకా.. మార్కెట్‌లోకి ఐఫోన్ 18 ప్రో మోడల్స్.. నెక్స్ట్ లెవెల్ ఫీచర్లు, రేట్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!

ఇందులో కీలమైన ప్రక్రియ తీరప్రాంతంలోని డీశాలినేషన్ ప్లాంట్ల దగ్గర జరుగుతుంది. సముద్రపు నీటిని ప్లాంట్‌లోకి తీసుకురావడానికి తీరం నుంచి కొన్ని వందల మీటర్ల దూరంలో పెద్ద ఇన్‌టేక్ పైపులను ఏర్పాటు చేశారు. 63 సెంటీమీటర్ల పైపు ఒకటి ఒకరోజుకు 15 మిలియన్ల లీటర్ల నీటిని పంప్‌ చేస్తుంది. ఇక్కడ ఏర్పాటు చేసే ప్రొటెక్టివ్ స్క్రీన్స్.. చేపలు, పీతలు, జెల్లీ ఫిష్‌లు వంటివి లోపలికి రాకుండా అడ్డుకుంటాయి. ఆ తర్వాత నీటిని ఫిల్టర్ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే ఇలా శుద్ధి చేసిన నీటిలో ఖనిజాలు చాలా తక్కువగా ఉంటాయి. రుచి చప్పగా ఉంటుంది. అందుకే కాల్షియం, మెగ్నీషియం వంటి అవసరమైన ఖనిజాలను మళ్లీ మిక్స్‌ చేస్తారు. అదే సమయంలో నీటిని తాగడానికి అనువుగా pH స్థాయుల్ని సర్దుబాటు చేస్తారు. పైపుల్లో ఎక్కడైనా చిన్న ప్రాబ్లమ్‌ తలెత్తినా ఏఐ సెన్సార్లు క్షణాల్లో గుర్తించి సరి చేస్తాయి. ఇదంతా అత్యంత ఖరీదైన ప్రక్రియ. ఒక కి.మీ.దూరంలో పైప్‌లైన్ వేయాలంటే మిలియన్ల డాలర్ల ఖర్చవుతుంది. అలాంటిది 14 వేల కిలోమీటర్ల దూరం పైప్‌లైన్‌ వేశారంటే ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేశారో అంచనాకు అందదు..అందుకే సహజసిద్ధ నీటి వ్యవస్థలు లేని సౌదీ ఈ వ్యవస్థను జాతీయ మౌలిక సదుపాయాల్లో ఒక భాగంగా మార్చేసి తన ప్రత్యేకతను చాటింది.

ఈ వాటర్‌ సిస్టమ్‌ ద్వారా సౌదీ ప్రపంచానికి చెబుతున్న లెసన్‌ ఏంటంటే.. పరిస్థితులు మనకు అనుకూలించకపోతే వర్రీ అవ్వడం కాదు… మనమే కొత్త దారిని సృష్టించుకోవాలి! ప్రకృతి సహరించకపోయినా, మైండ్ బ్లోయింగ్ విజన్ & టెక్నాలజీతో ఒక దేశం ఎడారిలో కూడా నదిని సృష్టించగలదని సౌదీ అరేబియా నిరూపించింది. చమురు పవర్ మాత్రమే కాదు, వాటర్ మేనేజ్‌మెంట్‌లోనూ సౌదీ ఇన్స్పిరేషనల్ కింగ్ అంటున్నారు వరల్డ్‌ టాప్‌ ఇంజనీర్స్‌ అంట్ టెక్నీషియన్స్.