
భారతదేశంపై అమెరికా ఎప్పటికప్పుడు తన విద్వేషాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. గతంలో అనేక విషయాల్లో భారతదేశాన్ని, భారతీయ పౌరులపై తన పోస్టులతో, మాటలతో విద్వేషాన్ని ప్రదర్శించిన ట్రంప్ బృందం మరోసారి అదే ద్వేషాన్ని ప్రదర్శించింది. దేశంలో వలసల నియంత్రణ లక్ష్యంగా తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఒక పోస్టర్, వీడియోను విడుదల చేసింది. అ పోస్టర్లో ట్రంప్ బృందం భారతసంతతి ట్రక్కు డ్రైవర్లే టార్గెట్‌గా జాత్యహంకార వ్యాఖ్యలు చేసింది. హాలీవుడ్ సినిమా ‘ట్రాన్స్ఫార్మర్’లోని ఒక దృశ్యాన్ని తీసుకొని దానితో వీడియో క్లిప్పింగ్గా తయారు చేసిన ప్రకటనను యూఎస్ హోంలాండ్ సెక్యూరిటీ విభాగం ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.
If you approach this nation with hostile intent, know this. We will defend ourselves. We will defend Americanism. We will defend our home.
Report Illegal Aliens on American Roads: 866-347-2423 https://t.co/gJcDPA4CTH
— Homeland Security (@DHSgov) September 9, 2026
కాగా వారు విడుదల చేసిన ఆ పోస్టర్‌పై తలపాగా కలిగి ఉన్న వ్యక్తికి ఒక రోబో ఎదురుగా నిలబడి.. ‘‘మిస్టర్ సింగ్.. మా రోడ్లను వదిలిపెట్టండి. మీకు వాహనాలు నడపడం రాదు’’ అని హెచ్చరించినట్టుగా చూపించారు. ‘‘మీ అంతట మీరుగా దేశాన్ని వీడండి లేకపోతే మేం గుర్తిస్తాం’’ అని అధికారులు ఆ పోస్టర్‌పై పేర్కొన్నట్లు ఉంది. వీడియోలోనూ అదే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
https://t.co/JoS1yxZzfJ
— Homeland Security (@DHSgov) September 9, 2026
అమెరికా లో ట్రక్కు డ్రైవర్లుగా ఉన్నవారిలో ఎక్కవగా సింగ్ పేరుతోనే ఉన్నారు. వారంతా ఇండియాకు చెందిన వారుగా అమెరికా అధికారులు పేర్కొంటున్నారు. అయితే పోస్టర్లో ఉపయోగించిన పదాలను బట్టి చూస్తే కేవలం అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వారిని మాత్రమే కాకుండా భారత సంతతికి చెందిన ప్రజలందరినీ లక్ష్యంగా చేసుకున్నట్లు అనిపిస్తోంది. ఈ విద్వేష వ్యాఖ్యలపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘‘ఇది ఒక వివక్షాపూరిత పోస్టు. దీనిపై దర్యాప్తు జరగాలి ’’అని పలు హిందూ అమెరికన్లు, సిక్కు సంఘాలు డిమాండ్ చేశాయి.
కాగా, గతంలో అమెరికాలో అక్రమంగా నివసిస్తూ, కమర్షియల్ ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తున్నారనే అనుమానంతో సుమారు 30 మంది భారత పౌరులను యూఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు అరెస్ట్ చేశారు. ఫెడరల్ అధికారులు ‘ఆపరేషన్ చెక్‌మేట్’ పేరుతో నిర్వహించిన ఒక ప్రత్యేక ఆపరేషన్‌లో వీరు పట్టుబడ్డారు. అరెస్టయిన వారిలో 30 మంది భారత పౌరులు ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన ఆరుగురిలో ఇతర దేశాల వారున్నారు.









