
Osama Bin Laden : ఆల్‌ఖైదా ఉగ్రనేత ఒసామా బిన్ లాడెన్ అమెరికా మీద దాడిచేసి ఈ ఏడాదితో 25 ఏళ్లు గడుస్తుంది. 2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్-ఖైదా జరిపిన ఉగ్రదాడి ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడికి ముందే అల్-ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ దాడి చేయాలనుకున్న దేశాల జాబితాలో భారత్ కూడా ఉందని తాజాగా వెలుగు చూసిన రహస్య పత్రాల్లో వెల్లడైంది. భారత్ పైన కూడా దాడి చేయాలని లాడెన్ లక్ష్యంగా ఎంచుకున్నట్లు ఆ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఆల్ ఖైదా దాడి జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లాడెన్‌కు సంబంధించి అమెరికా (USA)కు చెందిన నిఘా సంస్థ సీఐఏ నుంచి వెళ్లిన 70 ప్రెసిడెన్షియల్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్స్‌ను బహిర్గతం చేశారు. సుమారు100 పేజీలకు పైగా ఉన్న ఈ పత్రాల్లో 9/11 దాడి జరగడానికి ముందు సీఐఏ సమీకరించిన రహస్య సమాచారం, హెచ్చరికలకు సంబంధించిన సంచలన వివరాలు ఉన్నాయి.
డీక్లాసిఫైడ్ సీఐఏ ఫైల్స్ సంచలనం: బిన్ లాడెన్ టార్గెట్లలో భారత్.
CIA డీక్లాసిఫై చేసిన 1998 ఆగస్టు నాటి ఇంటెలిజెన్స్ సమాచారంలో ఒసామా బిన్ లాడెన్ ఉగ్రదాడులు జరపాలని భావించిన దేశాల్లో భారత్ కూడా ఉన్నట్లు వెల్లడైంది. ఈ డాక్యుమెంట్ క్లింటన్ పాలన కోసం సిద్ధం చేసిన ప్రెసిడెంట్ డైలీ బ్రీఫ్‌లో భాగంగా ఉంది.
సెప్టెంబర్ 11 దాడులకు 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, CIA మొత్తం 9/11కి సంబంధించిన 71 పాక్షికంగా సవరించిన ఇంటెలిజెన్స్ డాక్యుమెంట్లను విడుదల చేసింది. వీటిలో 69 డాక్యుమెంట్లను తొలిసారిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ ఫైల్స్ ద్వారా 9/11 దాడులకు ఎన్నో ఏళ్ల ముందే బిన్ లాడెన్ నెట్వర్క్ నుంచి పొంచి ఉన్న ముప్పుపై మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.
@CIA @MEAIndia
— Ravi Prakash Official (@raviprakash_rtv) September 13, 2026
9/11 దాడుల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సీఐఏ దాదాపు 70కి పైగా అధ్యక్షుడి కోసం తయారు చేసిన నిఘా నివేదికల్లో 100 పేజీలకు పైగా ఉన్న రహస్య పత్రాలను బహిర్గతం చేయడం గమనార్హం. ఈ నివేదికలో బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో అధ్యక్షులకు అమెరికా నిఘా సంస్థలు అందించిన వివరాలు ఉన్నాయి. ఇందులో1998 ఆగస్టు 28 నాటి ‘బిన్ లాడెన్ టెర్రరిస్ట్ నెట్వర్క్ స్టిల్ ఎ థ్రెట్’ అనే శీర్షికతో ఉన్న ఒక ఇంటెలిజెన్స్ నివేదికలో పలు కీలక వివరాలున్నాయి. బిన్ లాడెన్ ఇండియాతో పాటు పాకిస్తాన్, ఈజిప్ట్, కువైట్, సౌదీ అరేబియా, యెమెన్, ఉగాండా, నైజీరియా వంటి పలు దేశాల్లో దాడులు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. అయితే ఈ పత్రాల్లో ఇండియాలో ఎక్కడ దాడి చేయాలనుకున్నారు. సంబంధి ప్రాంతం, తేదీ, స్పష్టమైన ప్లాన్ లాంటి వివరాలేవి పేర్కొనలేదు.
అమెరికాపై దాడుల అనంతరం అఫ్గానిస్తాన్‌లోని అల్-ఖైదా స్థావరాలపై అమెరికా క్షిపణి దాడులు చేసినప్పటికీ.. బిన్ లాడెన్, ఇతర తీవ్రవాద నాయకులు తప్పించుకున్నారని సీఐఏ తన నివేదికలో అంచనా వేసింది. ఈ దాడల్లో వారి కమ్యూనికేషన్ వ్యవస్థలు ఏ మాత్రం దెబ్బతినలేదని, అఫ్గానిస్తాన్‌లో శిక్షణా శిబిరాలను మళ్లీ ప్రారంభించారని ఆ పత్రాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 దేశాల్లో ఉన్న తన అనుబంధ ఉగ్రవాద సంస్థలు, వ్యక్తుల నెట్వర్క్ సహాయంతో దాడులు జరిపించే శక్తి బిన్ లాడెన్‌కు ఉందని ఆ నివేదికలో సీఐఏ హెచ్చరించింది.
అంతేకాదు, అమెరికాపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని 1998 నుంచి 2001 మధ్య కాలంలో సీఐఏ అనేకసార్లు అమెరికా అధ్యక్షులను హెచ్చరించినట్లు ఆ పత్రాలు నిరూపిస్తున్నాయి. అంతేకాదు తమ దేశంలోనే విమానాలను రవాణా సాధనాలుగా కాకుండా ఆత్మాహుతి ఆయుధాలుగా వాడి నగరాలపై దాడి చేయవచ్చనే హెచ్చరికలు కూడా అందులో ఉండటం గమనార్హం. అయినా నాటి అధ్యక్షులు పెడచెవిన పెట్టడం వల్లే భారీ నష్టం వాటిల్లిందని తేలింది.
ఈ హెచ్చరికలు వచ్చిన కొద్ది రోజులకే సెప్టెంబర్ 11, 2001న 19 మంది అల్-ఖైదా ఉగ్రవాదులు 4 ప్రయాణీకుల విమానాలను హైజాక్ చేశారు. అందులో రెండు విమానాలు న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ ను ఢీకొట్టడగా అవి నేలమట్టమయ్యాయి. మూడో విమానం పెంటగాన్ భవనాన్ని ఢీకొట్టింది.. నాలుగో విమానం పెన్సిల్వేనియాలోని ఓ పొలంలో కూలిపోయింది. ఈ దాడిలో దాదాపు 3 వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే..









