
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వీసాలు, వలసలు, యుద్ధాల పేరుతో సాగిస్తున్న కార్యకలపాలకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మరోసారి ఆయనకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఫెడరల్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌లకు సంబంధించి ట్రంప్ ఈ ఏడాది మార్చి నెలలో వెలువరించిన కార్యనిర్వాహక ఆదేశాలను కోర్టు నిలుపదల చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విధానంలో మోసం జరుగుతోందని ట్రంప్ ఆరోపిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా కార్యనిర్వాహక ఆదేశాలను జారీ చేశారు. ఆ ఆదేశాల ప్రకారం ఆయా రాష్ట్రాలు ఎన్నికలకు ముందే పోస్టల్ సర్వీసు విభాగానికి అర్హులైన ఓటర్ల జాబితాను అందించాల్సి ఉంటుంది. ఆ జాబితాలో పేరున్న వారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి అవకాశం ఉంటుందని ట్రంప్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. సంబంధిత పోస్టల్ బ్యాలెట్‌లకు సంబంధించిన ఎన్వలప్‌లపై ‘‘యూనిక్ బ్యాలెట్ ఎన్వలప్ ఐడెంటిఫయర్’’లను ముద్రించి వాటి ఆధారంగా కేవలం పౌరులకు మాత్రమే బ్యాలెట్ పేపర్లు అందేలా చూడాలని ట్రంప్ ఆదేశాలలో పేర్కొన్నారు. అదే సందర్భంలో అమెరికా స్టేట్ పోస్టల్ సర్వీసు (యూఎస్‌పీఎస్) నిర్దేశించిన విధానంలో మాత్రమే పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించిన డిజైన్‌లు రూపొందించాలని అధ్యక్షుడు తన కార్యనిర్వాహక ఆదేశాల్లో ఆదేశించారు.
Also Read : సౌదీపై హౌతీల దాడులు.. మక్కాలో తొలిసారి వైమానిక హెచ్చరికలు..
ఈ ఆదేశాల ప్రకారం ఫెడరల్ ఎన్నికలకు కనీసం నెల అంటే 30 రోజుల ముందు రాష్ట్ర లేదా స్థానిక ప్రభుత్వాలు అర్హత కలిగిన ఓటర్ల జాబితాను పోస్టల్ విభాగానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. పోస్టల్ విభాగపు పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన వ్యక్తులను మాత్రమే ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది. జాబితాలో లేని వారిని పోస్టల్ ఓటింగులో పాల్గొనేందుకు అనర్హులుగా పరిగణించాలి. అయితే ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఫెడరల్ కోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఫెడరల్ ఎన్నికల్లో ఓటింగు పద్ధతులను ఏకపక్షంగా మార్చే అధికారం అధ్యక్షునికి లేదని వ్యాజ్యకర్తలు కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన ఆదేశాలతో పోస్టల్ బ్యాలెట్‌ల విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరపడింది. అయితే పోస్టల్ బ్యాలెట్‌పై తాను విధించిన ఆంక్షలను ఎత్తివేసిన అమెరికా సుప్రీంకోర్టును ట్రంప్ తప్పు పట్టారు. అంతేకాదు ఈ తీర్పు వెలువరించిన న్యాయమూర్తులు తాను నియమించినవారు కాదని ఆసహానం వ్యక్తం చేశారు.
Also Read : ఛీ ఛీ.. పరువు తీసుకున్న పాక్.. ఫెయిర్‌నెస్ క్రీములలో కూడానా…భారత్ అలెర్ట్!









